ఎంప్లాయిస్ కోసం 7 స్క్రీన్‌లను బుక్ చేసిన సీఈఓ.. రజిని మూవీ అంటే అట్లుంటది..!

సూప‌ర్ స్టార్‌ రజనీకాంత్ పేరుకు తమిళ్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ జైల‌ర్ మూవీ ఈరోజు ఉద‌యం రిలీజై పాజిటివ్ టాక్ సంపాదించింది. రజనీకాంత్‌కు ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో తెలిసింది. తమిళనాడులో ఇంతకుమించి క్రేజ్ సంపాదించుకున్న రజినీకాంత్ జైలర్ మూవీ ఈరోజు రిలీజ్ సందర్భంగా తమిళనాడులోని ఓ కంపెనీ సీఈవో తమ ఎంప్లాయిస్ కోసం మొత్తం 7 స్క్రీన్స్ బుక్ చేసి మరి సినిమా చూపించారట. ఇంతకీ అతను ఎవరు..? ఏంటో..? ఒకసారి తెలుసుకుందాం.

తాజాసమాచారం ప్రకారం ఫ్రెష్ వర్క్స్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈవో గిరీష్ మాతృభూతం తన కంపెనీలో పని చేసే ఉద్యోగులందరికీ స్పెషల్ షోలు వేయించబోతున్నట్లు తెలుస్తుంది. దీనికోసం ఏకంగా 7 స్క్రీన్స్ ను ఇతను బుక్ చేసుకున్నాడట. తమ 2200 మంది ఉద్యోగుల కోసం ఇవి బుక్ చేసినట్లు తానే స్వయంగా ట్విట్టర్ వేదికగా వివరించాడు. ఫ్రెష్ వర్క్స్ కంపెనీ మొత్తం మూడు బ్రాంచ్లను మేనేజ్ చేస్తుంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో ఈ కంపెనీ కేంద్రాలు ఉన్నాయి.

ఈ సంస్థ సీఈవో రజనీకాంత్ కు వీరాభిమాని. ఈ కారణంగా జైలర్ సినిమా రిలీజ్ రోజే ఉద్యోగులకు సినిమా చూపించాలని ఫిక్స్ అయ్యాడట. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కబాలి మూవీ విడుదల టైంలో కూడా చెన్నైలో ఒక ధియేటర్‌ని బుక్ చేశాడు. అంతకుముందు వచ్చిన కొచ్చిడియ‌న్‌, లింగ, ఎంతీరన్‌ సినిమాలకు కూడా ఇలాగే చేశాడు. దీన్నిబట్టి గిరీష్ రజనీకాంత్‌ను ఎంతగా అభిమానిస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గిరీష్ చేస్తున్న పనికి సామాజిక మాధ్యమాలన్నిటిలోనూ గిరీష్ పేరు మారుమోగిపోతుంది. రజనీకాంత్ ఫ్యాన్స్ అతనిపై ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు.