సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళికి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ అందుకున్న తరువాత ఆయన పేరు మరింత మారుమోగిపోతుంది. ఇదే కాక రాజమౌళి గురించి ఎటువంటి వార్త వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన తప్పులు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ దర్శకధీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాలి అని చాలామంది నటులు ఆశపడుతూ ఉంటారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా రాజమౌళితో ఒక్క సినిమా చేసే ఛాన్స్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. ఆ లిస్టులో దగ్గుపాటి వెంకటేష్ కూడా ఒకడు.
నిజానికి మగధీర సినిమా టైం లోనే వెంకటేష్ తో రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించాల్సి ఉందట. వెంకటేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించే స్వామి వివేకానంద బయోపిక్ ను తెరకెక్కించాలని చాలా ట్రై చేస్తున్నాడు వెంకటేష్. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించాలి అని వెంకటేష్ గట్టిగా అనుకున్నారట. అంతేకాదు రాజమౌళి కూడా దీనికి ఓకే అంటూ ప్రామిస్ కూడా చేశాడట.
ఆ తర్వాత మగధీర హిట్ అవడంతో… ఆయన రేంజ్ క్రేజ్ రెండు మారిపోయాయి. వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. ఆ తర్వాత వెంకటేష్ స్వామి వివేకానంద ప్రాజెక్టును మర్చిపోయాడు. ఆ టైంలో దగ్గుపాటి కుటుంబ సభ్యులు చాలా హట్ అయ్యారట. అసలు రాజమౌళి ఎప్పుడు కాళీ అవుతాడో.. అసలు ఈ ప్రాజెక్ట వస్తుందో లేదో ఆ దేవుడికే తెలియాలి..!!