కళ్యాణ్ రామ్ భార్య స్వాతి – బాలయ్య భార్య వసుంధరకు ఇంత దగ్గర రిలేషన్ ఉందా..?

నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతమంది ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. నందమూరి బాలయ్య, ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలోగా కొనసాగుతున్నారు. మంచి ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే బింబిసారా సినిమాతో హిట్ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇటివ‌ల అమిగోస్‌ సినిమాలో నటించిన కళ్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభం నుంచి అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయాడు. అత‌డు నటించిన సినిమాల‌లో అతనొక్కడే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత వరుసగా ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి.

తర్వాత పటాస్, 118, బింబిసారా లాంటి సినిమాలు మాత్రమే కళ్యాణ్ రామ్ కెరీర్ లో మళ్లీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక కళ్యాణ్ రామ్ భార్య స్వాతి బ్యాగ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు. కళ్యాణ్ రామ్- స్వాతిలది పెద్దలు కుదిరిచిన వివాహం. 2006 ఏప్రిల్ లో స్వాతి- కళ్యాణ్‌ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కళ్యాణ్ రామ్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్న టైం లో అతడు అసాధ్యుడు సినిమా షూటింగ్లో ఉన్నాడు. బంధువుల ఇంటి ఫంక్షన్ కి వెళ్ళిన హరికృష్ణ స్వాతిని చూశాడ‌ట‌.

ఆమె ఎంతో అందంగా సాంప్రదాయంగా ఉందని ఆమె అయితే కళ్యాణ్ రామ్‌కి ఈడు జోడు బాగుంటుంది అనుకున్నాడట హరికృష్ణ. నందమూరి ఫ్యామిలీకి స్వాతి వాళ్ళ కుటుంబానికి దూరపు చుట్టురికం ఉంది. స్వాతి బాలకృష్ణ భార్య వసుంధరకు చాలా దగ్గర రిలేషన్ అట. స్వాతి తండ్రికి ఫార్మ, ఎలక్ట్రికల్ కంపెనీలు కూడా ఉన్నాయి. అప్పటికే చెన్నైలో మెడిసిన్ పూర్తి చేసిన స్వాతితో కళ్యాణ్ రామ్ కు పెళ్లి చేయాలని హరికృష్ణ డిసైడ్ అయ్యాడు.

ఈ విషయం కళ్యాణ్ రామ్ కు చెప్పగా కొద్ది రోజులు ఆగమని కండిషన్ పెట్టారట. అయితే తల్లి లక్ష్మీ మాత్రం అందుకు ఒప్పుకోకుండా కళ్యాణ్ రామ్ పై ఒత్తిడి తెచ్చి వివాహం చేసింది. ఇక పెళ్లి తర్వాత స్వాతిని పై చదువులు చదివించి ఎలాగైనా డాక్టర్ గా చూడాలని హరికృష్ణ కి కోరిక ఉండదట. ఆయన పిల్లలు ఎవరైనా డాక్టర్ అయితే చూడాలన్న కోరిక స్వాతి ద్వారా ఆయన తీర్చుకోవాలి అనుకున్నాడట. ఆమె ఫ్యాషన్ డిజైన్ పై ఉన్న ఆసక్తితో అటువైపుగా అడుగులు వేసింది. ఇక స్వాతి కుటుంబం కళ్యాణ్ రామ్‌కు సినిమాలు పరంగాను, వ్యాపార విషయాల్లోనూ ఎప్పుడు అండదండగా నిలుస్తారు,