రామ్ చరణ్- సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన కాంబినేషన్లలో రావలసిన సినిమాలను పలు కారణాలతో మనం మిస్ అవుతూనే ఉన్నాం. ఇక అలానే మనము ఓ అద్భుతమైన కాంబినేషన్‌లో సినిమాను కూడా మిస్అయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది..

అయితే ఈ సినిమాను కొన్ని కారణాలతో రామ్ చరణ్ రిజ‌క్ట్ చేశాడు. అ సినిమా మ‌రి ఏదో కాదు ఫిదా. ఇక త‌ర్వాత‌ వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటించి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమాను ముందుగా రామ్ చరణ్‌ని హీరోగా అనుకున్నారట శేఖర్ కమ్ముల. రామ్ చరణ్ తో పాటు ఎంతోమంది స్టార్ హీరోలు అప్రోచ్ అయిన శేఖర్ కమ్ముల వారంతా రిజెక్ట్‌ చేయడంతో వరుణ్ తేజ్‌కు కథ‌ వినిపించాడు.

కుటుంబ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండడంతో హీరోస్ అందరూ ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. చివరికి వరుణ్ తేజ్ సినిమాని ఓకే చేయడంతో ఈ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్ నటించిన సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ద్వారా సాయి పల్లవి తో పాటు వరుణ్ కూడా వరుస అవకాశాలు ద‌క్కించుకున్నాడు.