నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. శరీరం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే నిద్ర కంపల్సరీ కావాల్సిందే. బాడీ హెల్తీగా గా ఉండడానికి 7 నుంచి 8 గంటల పాటు నిద్ర చాలా అవసరం. ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది నిద్రలేని సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.
ప్రతిరోజు సరైన సమయంలో నిద్రపోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రక్త ప్రసరణ జరుగుతుంది. సరైన నిద్రలేని వారిలో తరచుగా రత్త సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి లోపాలు వంటి అనేక ఆనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు సరైన సమయంలో నిద్ర పోవలి.
ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. చాలామందికి తెలియనిది ఏమిటంటే మెదడులో కాణాలు చాలావరకు వ్యర్థ పదార్థాలను నిండి ఉంటాయి. అయితే ఇవి ఎక్కువగా నిండిపోవడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు 8 గంటల పాటు నిద్రపోవడం అలవాటు చేసుకోండి.
అలాగే చాలామందికి చిన్న వయసులోనే గుండెపోటు వంటి వ్యాదులు వస్తున్నాయి.. దీనికి కారణం నిద్ర లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల తగినంత నిద్ర తీసుకోవడం వల్ల ఎటువంటి గుండె సమస్యలు రావు. నిద్ర లేకపోతే కండరాలు బలహీనంగా మారి శరీరం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనికి ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడం వల్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కండరాల బలహీనత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 8 గంటల పాటు తప్పకుండా నిద్ర పోవాల్సిందే.