కాజల్ సెంటిమెంట్ తో వస్తున్న బాలయ్య భగవంత్ కేస‌రి.. ఇది రిపీట్ అయితే హిట్ పక్కాగా..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో భగవంత్ కేస‌రి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వగా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా ఈ సినిమాలో బాలయ్య తన గత సినిమాలకు భిన్నంగా ఎంతో కొత్తగా కనిపించబోతున్నాడు అని అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ తో క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పటికే ఈ సినిమా స్టోరీకి సంబంధించి కథ ఇదే అంటూ ఇప్పటికే చాలా రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో బాలయ్యకు జంట‌గా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీలా కూడా ఈ సినిమాలో బాలకృష్ణకు కూతురు పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో రివిల్ అవుతుందని అంటున్నారు.

బాల‌య్య‌- కాజల్ అగర్వాల్ యుక్త వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటారని… వీరిద్దరి ప్రేమకు గుర్తుగా శ్రీ లీల జన్మిస్తుందని అంటున్నారు. అయితే ఒక ప్రమాదంలో కాజల్ అగర్వాల్ చనిపోతుందని ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ స్వయంగా శ్రీ లీలను పెంచుకుంటాడని అంటున్నారు. నిజానికి కాజల్ అగర్వాల్ అలా మద్యంతరంగా చనిపోయే పాత్రలు చేయడం ఇదేమి కొత్త కాదు.

గతంలో నేనే రాజు నేనే మంత్రి, ఎవడు వంటి సినిమాల్లో కూడా కాజల్ అగర్వాల్ చనిపోయినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు అదే తరహాలో ఆమె ఈ పాత్ర చేస్తుందని అంటున్నారు. ఆ సినిమాతో రానాకు మంచి హిట్ ఇచ్చింది కాజల్. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు కూడా రిపీట్ అవుతుందని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. ఇక మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే.