అందం ఉన్న అవకాశాలు అందుకోలేకపోతున్న బుట్ట బొమ్మలు వీళ్లే.. కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ అడుగు పెడుతూనే ఉన్నారు. అలా కొత్త హీరోయిన్స్ వారి టాలెంట్ చూపించే సమయంలో చాలామంది స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకులు ఫెడ్ అవుట్ అవుతున్నారు. అలా ప్ర‌స్తుతం అందం ఉన్నప్పటికీ అవకాశాలు లేక సినిమాల కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

రాశి ఖ‌న్నా :
ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం అవుతున్న రాశి ఖ‌న్నా ఒకప్పుడు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోయింది. ప్రస్తుతం సరైన ప్రాజెక్ట్ లేక సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఒక దశలో అవకాశాల కోసం సైజ్ జీరో కి మారిన ఈమెకి అవ‌కాశాలు రాలేదు. దీనికి తోడు పక్క కమర్షియల్, థ్యాంక్యు లాంటి సినిమాలు పెద్ద డిజాస్టర్స్ కావడంతో ఆమెకి అవకాశాలు ఇచ్చే వారి కరువయ్యారు.

నిధి అగర్వాల్ :
బాలీవుడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలను అందుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు ఏవి సక్సెస్ కాకపోవడం దానికి తోడు పవన్‌తో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా ఆగిపోవడంతో ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి.

నభా నటేష్ :
రామ్ పోతినేనితో కలిసి ఈ స్మార్ట్ శంకర్ సినిమాలోనే నభా నటేష్ కూడా నటించింది. ఈ సినిమానే ఆమెకు సక్సెస్ అందించింది. ఆ తర్వాత ఆమె 4 సినిమాల్లో నటిస్తే ఆ నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం గ్లామర్ షోస్ తో రెచ్చగొడుతున్న నభాకు మాత్రం అవకాశాలు రావడం లేదు.

నివేత పేతురాజ్ :
దాస్ కా దమ్కీ సినిమాతో సక్సెస్ సాధించినప్పటికీ నివేత పేతురాజ్‌కు కలిసి రాలేదు. ప్రస్తుతం సరైన ప్రాజెక్ట్ లేక సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అలానే మెహరీన్ కూడా గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అయింది కానీ టాలీవుడ్ లో మాత్రం సక్సెస్ రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక సినిమా ఉంది. అది కూడా చిన్న సినిమా.

ఈమెతోపాటే అను ఇమ్మానియేల్, మేఘా ఆకాష్ ల కెరీర్ కూడా చివరి దశకు చేరుకుంది. అలాగే లావణ్య త్రిపాఠి, రీతు వర్మ కూడా ఈ లిస్టులోకి ఉన్నారు. చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే సినిమాల తర్వాత ఈమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టే అయింది. ఇలా ఒకరిద్దరు కాకుండా చాలా మంది స్టార్ హీరోయిన్స్ అవకాశాలు దొరకక ఇబ్బంది పడుతున్నారు.