శ్రావణమాసం అమ్మవారికి ప్రత్యేకమైన రోజులు.. ఈ మాసంలో స్త్రీలు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ మాసంలో మహిళలకు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఇంటికి దరిద్ర దేవత వస్తుందని చెబుతున్నారు. శ్రావణమాసంలో స్త్రీలు అసలు దానం చేయకూడని వస్తువులు కూడా ఉన్నాయి. ఆ వస్తువులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని పెద్దలు చెబుతారు.
రక్త దానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. ఎవరైనా అవసరంలో, కానీ అపాయంలో ఉన్నవారికి సహాయం చేస్తే దాన్నే దానం అని అంటారు. చాలామంది అన్నదానం చేస్తుంటారు. అలాగే మరికొందరు వస్తువులు దానం చేస్తుంటారు. ఇలా తనుకు తోచిన దానం చేస్తూ ఉంటారు. శనివారాలలో నూనెను దానం చేస్తారు. ఎందుకంటే ఏదైనా దానం చేస్తే అది అవతలి వాళ్లు సంతోష పడేలా చేయ్యాలి. ఇకపోతే ఈ మాసం అమ్మవారికి అంకితం… అందుకే స్త్రీలు వ్రతాలు లాంటి పూజలు చేస్తూ ఉంటారు. అయితే చీపురు, ఉప్పు, కారం, ఇనుము ఎప్పుడు దానం చేయకూడదు.
ఈ విధంగా దానం చేసినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయి. అలాగే అనారోగ్య బారిన పడతారు. కాబట్టి స్త్రీలు ఈ వస్తువులని ఎప్పుడూ దానం చేయకండి. ఏ దానం చేసిన ఏ పూజ చేసిన భక్తిశ్రద్ధలతో చేయాలి… అప్పుడే మంచి ఫలితం దక్కుతుంది. అలాగే మీరు ఎవరికైనా దానం చేయాలనుకుంటే డబ్బు దానం అస్సలు చేయకండి. వాళ్లకి ఏమన్నా తినే వస్తువులు ఇప్పించండి.