ఆ సినిమా నేను చేయ‌ను బాబోయ్‌.. బ‌న్నీ రిజెక్ట్ చేసిన ఆ సినిమా ఇదే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత‌ పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న పుష్ప 2 సినిమాతో మరింత బలమైన ముద్రను వేసేందుకు సిద్ధమవుతున్నాడు. పుష్ప 2 షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయింది. త్వరలోనే మిగిలిన సగం షూటింగ్‌ను ముగించి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందించుకు పుష్ప 2 చిత్రం విడుదల ముందే బన్నీ రెండు మూడు సినిమాలకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని వార్తలు.

కానీ అల్లు అర్జున్ ఇప్పటివరకు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగతో సినిమాకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. బన్నీ ఆ మధ్య ” అశ్వద్ధామ ” సినిమాను చేసేందుకు చర్చలు జరుపుతున్నారని గతంలో వార్తలు వినిపించాయి.

కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ సినిమాకు నిర్మోహమాటంగా నో చెప్పేసాడు అని తెలుస్తుంది. ప్రస్తుతానికి అశ్వద్ధామ సినిమాని చెయ్యలేను అంటూ మొహం మీద చెప్పేసాడట. అల్లు అర్జున్ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడని దీనిబట్టి అర్థమవుతుంది. అదే విధంగా తనకు బ్యాక్ టు బ్యాక్ విజయాలు ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ తోనే తన తర్వాత సినిమా చేయడానికి బన్నీ రెడీ అయ్యాడు.