ఆ వైసీపీ ఎమ్మెల్యేకు సీటు లేదోచ్‌… టైం చూసి స్కెచ్ వేస్తోన్న బాబు…!

గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేల్లో టాప్ 2 లో ఉన్నది గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. మొదట జగన్ పులివెందులలో 90 వేల మెజారిటీ తెచ్చుకోగా, ఆ తర్వాత రాంబాబుకి 81 వేల ఓట్ల భారీ మెజారిటీ వచ్చింది. ఇక అంత భారీ మెజారిటీ తెచ్చుకున్న రాంబాబుకు నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కుతుందో లేదో అనే డౌట్ ఉంది.

Andhra Pradesh: TDP Chief Chandrababu Naidu Gets Centre's Invite For  Crucial Meet

అంటే పరిస్తితి ఎంతవరకు దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. జగన్ ఇప్పటికే సరిగ్గా పనిచేయని వారికి సీటు ఇవ్వనని చెప్పేశారు. ఈ క్రమంలోనే పనితీరు ఏ మాత్రం బాగోని రాంబాబుకు సీటు దక్కడం డౌటే. అసలు ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి లేదు..ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదు…పైగా గిద్దలూరులో అక్రమాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు నెగిటివ్ పెరిగింది.

దీంతో తనకు సీటు వస్తుందో లేదో అనే డౌట్ ఎమ్మెల్యేకే ఉంది. తాజాగా గృహసారధులు, పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో రాంబాబు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో జగన్‌ ఎవ్వరికి టికెట్‌ ఇచ్చినా నియోజకవర్గంలో పార్టీ కోసం కృషి చేస్తానని, ఇక జగన్‌ ఆశీస్సులు ఎవ్వరికి ఉంటే వారికే పార్టీ టికెట్‌ వస్తుందని, వారికి తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. అంటే తనకు సీటు వస్తుందనే కాన్ఫిడెన్స్ లేదు. దీని బట్టి చూస్తే అక్కడ వైసీపీకి పెద్ద డ్యామేజ్ జరిగిందనే చెప్పాలి.

వైసీపీకి గుడ్‌బై? టీడీపీ వైపు అడుగులు?? ఆ ఎమ్మెల్యేకు పార్టీతో పెరుగుతున్న  అంతరం!! | Giddalur MLA Anna Rambabu eyeing on TDP,here is the reason -  Telugu Oneindia

ఇదే సమయంలో ఇక్కడ టి‌డి‌పి బలపడుతూ వస్తుంది. ఇంచార్జ్ అశోక్ రెడ్డి..దూకుడుగా పనిచేస్తున్నారు..నియోజకవర్గంలో భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులని టి‌డి‌పిలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఈ నెల 19వ తేదీన గిద్దలూరు పర్యటనకు వస్తున్నారు. దీంతో టి‌డి‌పికి మరింత జోష్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇదే ఊపు కొనసాగితే గిద్దలూరుని టి‌డి‌పి దక్కించుకోవచ్చు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp