టాలీవుడ్‌లో `క‌మ్మ‌` డామినేష‌న్‌.. ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఉద్య‌మం చేశారా..!

సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఒక‌టి రెండు కులాలు మాత్ర‌మే డామినేష‌న్ చేస్తున్నాయ‌నే ప్ర‌చారం ఉంది. దీనిపై అనేక విమ‌ర్శ‌లు.. వాదోప‌వాదాలు కూడా న‌డుస్తున్నాయి. అయితే.. ఇది సినిమా ఇండ‌స్ట్రీకి కొత్త‌కా దు. గ‌తంలో అంటే.. బ్లాక్ అండ్ వైట్ నుంచి క‌ల‌ర్‌లోకి మారే రోజుల్లోనూ.. ఇండ‌స్ట్రీలో ఇదే వాద‌న మొద‌లైంది. ఒక‌ప్పుడు బ్రాహ్మ‌ణ ఆధిప‌త్యం ఉండేద‌ని టాక్ న‌డించింది.

Pasupuleti Kannamba Wiki Bio Age Husband Salary Photos Videos Ig Tw

క‌స్తూరి శివ‌రావు, క‌న్నాంబ‌, సూర్యాకాంతం, భానుమ‌తి, సీఎస్ ఆర్‌.., శ్రీశ్రీ(ర‌చ‌యిత‌), చ‌లం(ర‌చ‌యిత‌) వంటి అగ్ర తార‌లు అంద‌రూ కూడా బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో అప్ప‌ట్లో కొన్నాళ్లు ఈ వాద‌న న‌డిచింది. త‌ర్వాత‌.. అక్కినేని, ఎన్టీఆర్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, మోహ‌న్‌బాబుల ఎంట్రీతో క‌మ్మ వ‌ర్గం డామినేష‌న్ పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. ఇత‌రులు ఈ విష‌యంలో సైలెంట్‌గా ఉండేవారు.

Suryakantham - IMDb

కానీ, హీరో కృష్ణ‌, శోభ‌న్‌బాబు మాత్రం ఈ వాద‌న‌ను ఖండించేవారు. తొలిసారి సినిమా ఇండ‌స్ట్రీని `క‌ళామ‌తల్లి` అని సంబోధించిన శోభ‌న్‌బాబు.. “అంద‌రూ ఆ క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌లే. ఇందులో కులాలు ఏరుకుంటామంటే.. మీ ఇష్టం“ అని ఒకింత గ‌డుసుగానే వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కృష్ణ కూడా ఇదే వాద‌న వినిపించేవారు. “కులాలు మ‌తాల‌కు ఇండ‌స్ట్రీ వ్య‌తిరేకం“ అనిచాటి చెప్పారు.

P Bhanumathi - Upperstall.com

అంతేకాదు.. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి స‌హా.. అనేక మందిని ప్రోత్స‌హించారు. చాలా మందికి తెలుసో లేదో .. బాబూ మోహ‌న్ తొలి ఎంట్రీ కృష్ణ సినిమాతోనే. ఇలా .. అటు శోభ‌న్‌బాబు.. ఇటు కృష్ణ క‌మ్మ డామినేష‌న్ అంటే ఒప్పుకొనేవారు. ఏదో ఒక రూపంలో ఉద్య‌మం చేసేవారు. ఇదీ.. సంగ‌తి!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news