కుప్పం కొడ‌దామ‌నుకుంటే పులివెందుల కొట్టుకుపోయిందిగా…!

ఏపీలో వైసీపీ వాళ్లు గత కొద్ది నెలలుగా కుప్పంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడిస్తాం.. చంద్రబాబుని అసెంబ్లీ గేటు కూడా దాటనీయం అంటూ నానా హంగామా చేస్తూ వస్తున్నారు.
కుప్పం మున్సిపల్ ఎన్నికలలో వైసిపి విజయం సాధించింది. చిత్తూరు జిల్లాకి చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్పతోపాటు వైసీపీ కీలక నేతలు అందరూ అక్కడ మోహరించి.. కుప్పం మున్సిపాలిటీ పై వైసీపీ జెండా ఎగరవేసేలా చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీని కూడా కోల్పోవడం చంద్రబాబుకు పెద్ద ఎదురు దెబ్బ అయ్యింది.

Chandrababu Naidu urged CM YS Jagan to lead all-party delegation to meet PM  Modi on Krishna Water Dispute

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి శ్రేణులు కూడా ఒక్కసారిగా డీలా పడిపోయాయి. అసలు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావడం పక్కన పెడితే సొంత నియోజకవర్గంలోనే మున్సిపాలిటీని కోల్పోవడం ఏంటన్న ?ప్రశ్నలు రకరకాల సందేహాలు కూడా టీడిపి వర్గాల్లో వ్యక్తం అయ్యాయి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసిపి జెండా ఎగరవేస్తామని జగన్ ప్రగల్బాలు పలుకుతూ వచ్చారు. ఆ తర్వాత చాలా సర్వేలు జరిగాయి. అన్ని సర్వేలలోనూ మున్సిపాలిటీలో టీడిపి ఓడిపోయినా.. 2024లో కుప్పంలో మాత్రం చంద్రబాబుది గెలుపు అని కుండ బద్దలు కొట్టేసాయి.

మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి గెలిచాక ఆ గెలుపును చాలా వెకిలిగా వెటకారంగా చూపిస్తూ.. చంద్రబాబును గేలిచేస్తూ వైసిపి వాళ్ళు చేసిన హంగామాను తెలుగు ప్రజలు పెద్దగా ఇష్టపడలేదు. ఎంతో కొంత ఓర్చుకున్నా… సాధారణ జనాలు కనీస సగటు పరిజ్ఞానం ఉన్నవాళ్లు అందరూ అంగీకరించలేదు. అలాంటి ధోరణికి తాము వ్యతిరేకం అని తాజాగా జరిగిన ఎన్నికల్లో కుండ బద్దలు కొట్టేలా తీర్పు ఇచ్చారు. కుప్పంలో వైసిపి జెండా ఎగరటం ఏమోగానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలోనే దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు.

జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ పెట్టినా… పులివెందులలో ఆయన ఫోక‌స్‌ తగ్గింది. ఇదే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోను స్పష్టంగా కనపడింది. పులివెందులలో వైసిపి అభ్యర్థికి టీడిపి అభ్యర్థి కంటే చాలా తక్కువ ఓట్లు పోల్ అవటమే ఇందుకు వాస్తవం అని చెప్తున్నారు. దీనికి తోడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా పులివెందుల నియోజకవర్గం అవడంతో పార్టీలకు అతీతంగా వైసిపి అభిమానులు కూడా ఆయనకు ఓట్లేసి గెలిపించుకున్నారు. ఏదేమైనా జగన్ కుప్పం కొట్టడం సంగతి ఏమోగానీ పులివెందులపై ఫోకస్ తగ్గితే రిజ‌ల్ట్ ఎలా ? ఉంటుందో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణగా నిలిచాయి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp