కొడుకుల కోసం నాగార్జున సంచలన నిర్ణయం.. అక్కినేని ఫ్యామిలీకి కొత్త మెంబర్..!

అక్కినేని కుటుంబానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఈ ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్తుంటారు. అయితే గ‌త కొంత కాలంగా అక్కినేని హీరోస్ పై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది. సమంతతో నాగచైతన్య విడాకులు తర్వాత ఈ ట్రోలింగ్ మ‌రి కాస్త ఎక్కువైంది. ఈ మధ్యన అక్కినేని హీరోస్ చేసిన అన్ని సినిమాలు వరుసగా ప్లాప్‌ కావడంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వీరిపై కామెంట్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో కొడుకుల కోసం నాగార్జున స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటూ వార్తలు వైర‌ల్ అవుతున్నాయి. ఇక‌ నాగచైతన్య, అఖిల్‌ అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం వారి కథల ఉంపిక‌ బాగో లేకపోవడమే అని చాలా మంది జనాలు రివ్యూలు ఇచ్చారు. ఈ కారణంగా నాగార్జున.. నాగచైతన్య, అఖిల్ సినిమాల విషయంలో పర్సనల్ అసిస్టెంట్‌ని అపాయింట్ చేస్తున్నారని వీరిద్దరు సినిమాల చూసింగ్‌ విషయంలో సపరేట్ టాలెంటెడ్ మేనేజర్‌ని ని నాగ్ చూస్ చేసుకున్నాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ మేనేజర్ సజెషన్ ప్రకారం గానే నాగచైతన్య తన నటనకు ఇంకా పెంపొందించుకోవడానికి ఆదిశక్తి థియేటర్లో జాయిన్ అయ్యాడట. అలాగే రేపో మాపో అఖిల్ కూడా ఇందులో జాయిన్ కాబోతున్నాడు అంటూ సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చివరికి మేనేజర్‌ను అపాయింట్ చేసుకుని ఆ వ్యక్తిపై పూర్తిగా ఆధారపడుతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.