బాలయ్యతో ఐటెం సాంగ్‌… ఆ హాట్ హీరోయిన్‌ను ఫిక్స్ చేసిన అనిల్‌…!

అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ విజ‌య‌ల‌ను తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్‌పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Tamannaah demands huge remuneration to romance Balakrishna - IBTimes India

యంగ్ సెన్సేషన్ శ్రీ లీల, బాలీవుడ్ స్టార్ నటుడు అర్జున్ రామ్ పాల్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఖ‌చ్చితంగా ఈ సినిమాతో బాల‌య్య హ్యాట్రిక్ హిట్లు కొడ‌తాడ‌న్న అంచ‌నాలు టాలీవుడ్ వ‌ర్గాల్లో ఉన్నాయి.

Balayya following the footsteps of NTR and Krishna

ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్‌ని ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఏ హీరోయిన్ని అప్రోచ్ అవుతాడో.. ఎవరితో బాలయ్యకి జోడిగా స్టెప్ లు వేయిస్తాడో అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. అయితే ఇందుకోసం ముగ్గురు హీరోయిన్ల పేర్లు అయితే ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అనిల్ రావిపూడి సినిమాల్లో స్టార్ హీరోయిన్ల‌తో లేదా ఓ హీరోయిన్‌తో స్పెష‌ల్ సాంగ్ ఉంటూ వ‌స్తోంది. అదే సెంటిమెంట్ బాల‌య్య సినిమాలోనూ ఫాలో అవుతున్నాడు.

Kajal to romance Balakrishna

టాలీవుడ్ సర్కిల్స్ అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్యతో మిల్కీ బ్యూటీ తమన్నా ఈ పాటలో అదిరిపోయే స్టెప్పలు వెయ్యబోతుందని ఓ టాక్‌ కూడా వినిపిస్తుంది. వచ్చే షెడ్యూల్లో బాలయ్య – శ్రీలీల కాంబినేషన్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ షూట్ చేస్తారు. ఇక ఈ సినిమాలోనే ఈ సాంగ్ ఎంతో స్పెషల్ గా ఉండబోతుందట.