రోడ్డు ప్ర‌మాదంలో టీడీపీ టాప్ లీడ‌ర్‌కు తీవ్ర గాయాలు… వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ అంత‌లోనే ప్ర‌మాదం…!

రోడ్డు ప్ర‌మాదంలో టీడీపీకి చెందిన ఓ కీల‌క నేత‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్ర‌కాశం జిల్లా మార్కాపురం టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయ‌ణ‌రెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మార్కాపురం నుంచి హైద‌రాబాద్‌కు కారులో ప్ర‌యాణిస్తుండ‌గా య‌ర్ర‌గొండ‌పాలెం మండ‌లం గురిజేప‌ల్లి ద‌గ్గ‌ర నారాయ‌ణ‌రెడ్డి ప్ర‌యాణిస్తోన్న కారు బోల్తా ప‌డ‌డంతో ఆయ‌న‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంట‌నే ఆయ‌న్ను మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు.

Kandula Narayana Reddy Biography, Edu, Career, and More

కందుల నారాయ‌ణ‌రెడ్డి 2004లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కుందూరు పెద్ద కొండారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2009లో అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత 2014 – 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా వైసీపీ చేతిలో ఓడిపోతూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌నే మార్కాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉండ‌డంతో పాటు పార్టీ కార్య‌క్ర‌మాలు చాలా ప‌క్కాగా నిర్వ‌హిస్తున్నారు.

ఈ సారి మార్కాపురంలో ఆయ‌న‌కు సానుభూతి ప‌వ‌నాలు కూడా గ‌ట్టిగా ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోన్న క్ర‌మంలో ఆయ‌న హ‌ఠాత్తుగా ప్ర‌మాదానికి గుర‌య్యారు. లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న క్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గంలోని పొదిలిలో సంఘీభావ యాత్ర నిర్వ‌హించారు. ఈ యాత్ర‌లో పాల్గొన్న హైద‌రాబాద్‌కు వెళుతోన్న క్ర‌మంలోనే తీవ్ర గాయాల పాల‌వ్వ‌డంతో టీడీపీ శ్రేణులు ఒక్క‌సారిగా నిశ్చేష్టుల‌య్యారు.

TDP MLA Kandula Narayana Reddy

అప్ప‌టి వ‌ర‌కు త‌మ‌తోనే యాత్ర‌లో పాల్గొన్న నారాయ‌ణ రెడ్డి ఒక్క‌సారిగా తీవ్ర ప్ర‌మాదానికి గురి కావ‌డంతో ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. వివాద ర‌హితుడు అయిన నారాయ‌ణ రెడ్డి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని రాజ‌కీయాల‌కు అతీతంగా మార్కాపురం ప్ర‌జానీకం కోరుకుంటోంది.