స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – ఐశ్వర్య లక్ష్మి కలిసి జంటగా నటించిన మూవీ కింగ్ ఆఫ్ కోత. ఈ సినిమా ఆగస్టు 24న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్గా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు దుల్కర్ – ఐశ్వర్య. ఇలా ఓ ప్రమెషన్‌లో భాగంగా ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ హీరో దుల్కర్ సల్మాన్ తో తనకున్న రిలేషన్షిప్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఇలాంటి పెద్ద ప్రాజెక్టులో నటించడం నాకు ఇదే మొదటిసారి.. ఈ సినిమాలో నేను తార రోల్ ప్లే చేస్తున్నాను, దిల్కర్ గారు రాజుగా కనిపిస్తారు. మా ఇద్దరి మధ్య ఓ అందమైన లవ్ స్టోరీ నడుస్తుంది. ప్రేక్షకులు కచ్చితంగా ఆ లవ్ స్టోరీకి ఫ్యాన్స్ అవుతారు. మూవీ మొత్తం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతేకాదు ఈ లవ్ స్టోరీకి అద్భుతమైన మ్యూజిక్ జతయింది.
ఈ సినిమా నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపే కాదు, ఎన్నో అవకాశాలు వస్తాయని బలంగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. చివరిగా దసరాలో కీర్తి సురేష్ ప్లే చేసిన క్యారెక్టర్ బాగా నచ్చిందని అవకాశం ఉంటే అలాంటి రోల్ ప్లే చేయాలని ఆశగా ఉందంటూ వివరించింది.