బాల‌య్య కూతురిని తొలిచూపులోనే ల‌వ్ చేశా… ఆ సీక్రెట్ చెప్పేసిన లోకేష్ ( వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నట‌సింహ బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి తన మేనత్త కుమారుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు అయినా నారా లోకేష్ ను 2007లో పెళ్ళాడిన సంగతి తెలిసిందే. బ్రాహ్మణి పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడరు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అటు అమ్మగా, గృహిణిగా, వ్యాపారవేత్తగా వేరువేరు రంగాలలో సత్తా చాటుతున్న ఆమె ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల నేపథ్యంలో యువ‌గళం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోకేష్ యువతతో మీట్ అవుతూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు లోకేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. బ్రాహ్మణి గారితో పెళ్లి ప్రతిపాదన మొదట ఎవరు ? తీసుకొచ్చారు అని ఆ విద్యార్థిని ప్రశ్నించింది.

దీంతో ఒక్కసారిగా ఎగ్జిట్ అయిన లోకేష్ నాది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. మామయ్య భయంతో భయపెట్టలేకపోయా.. తర్వాత అమ్మానాన్న చర్చలు జరిపిన తర్వాత నా అభిప్రాయం అడిగారు.. మొత్తంగా బ్రాహ్మణి, నేను తొలిచూపులోనే ప్రేమించుకున్నాం.. బ్రాహ్మణి పెళ్లి ప్రతిపాదన అంగీకరించడంతో మిగిలినది చరిత్రగా మారింది అంటూ లోకేష్ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.