థూ ఇదీ ఓ సినిమానా.. ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కుడు కామెంట్‌

సాధార‌ణంగా సినిమా వ‌స్తుంటాయి. వాటిని ప్రేక్ష‌కులు చూస్తుంటారు. న‌చ్చితే న‌చ్చింద‌టారు. ప‌దిమందికి చెబుతారు. న‌చ్చ‌క‌పోతే అలా వ‌దిలేస్తారు. ఇక సినీ విమ‌ర్శ‌కులు మాత్రం అలా కాదు. సినిమాలోని పాట‌లు, మాట‌లు, డైరెక్ష‌న్‌, సాంకేతిక సిబ్బంది ప‌నితీరు, క‌థ‌, క‌థ‌నం, న‌టీన‌టుల అభిన‌యం, హాస్యం ఇలా ప్ర‌తి అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తారు. త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తుంటారు. వారిపై ఆధార‌ప‌డి కొన్ని సినిమాల‌కు హిట్ టాక్ వ‌స్తుంటుంది. మ‌రింత క్రేజీ ఏర్ప‌డుతుంది. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన త‌ప్పాడ్ సినిమాపై సినీ విమ‌ర్శ‌కుడు కమాల్ ఆర్ ఖాన్ దారుణ‌మైన కామెంట్ చేశారు. థూ ఇదీ సినిమానా అంటూ సోషల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హం వెల్ల‌గ‌క్క‌డం గ‌మ‌నార్హం. ఆ పోస్టు వైర‌ల్ గా మారింది.

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. తాప్సి ప‌న్ను ప్ర‌ధాన పాత్ర‌లో త‌ప్పాడ్ సినిమా రూపొందింది. అందులో ఆమె సాధార‌ణ భ‌ర్త‌, ఇల్లే స‌ర్వ‌స్వం అనేకునే ఓ గృహిణి పాత్రలో క‌నిపిస్తారు. ఒకానొక సంద‌ర్భంలో వర్క్ టెన్షన్‌లో ఉన్న భ‌ర్త ఆమెను ఒక చెంప దెబ్బ కొడ‌తాడు. అంతే దాంతో ఆమె విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కుతుంది. కేవలం ఒకే ఒక్క చెంప దెబ్బ వల్ల విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న తాప్సి నిర్ణయానికి న్యాయస్థానం కూడా షాక్ అవుతుంది. అదే విష‌యాన్ని ప్ర‌శ్నిస్తే ఆయన ఒక్కసారే కొట్టారు? కానీ నిజ‌మైన ప్రేమ ఉంటే కొట్టాల్సిన‌ అవసరం లేదు కదా అని తాప్సి తిరిగి ప్రశ్నించిన తీరు ఆలోచింపజేస్తోంది. మొత్తంగా ఒక్క‌మాట‌లో చెప్పాలంటే మ‌హిళ‌ల ఆత్మగౌర‌వానికి సంబంధించిన అంశం ఇతివృత్తాంతంగా తెర‌కెక్కిన సినిమా ఇది. దీనిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తున్న‌ది. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అయితే సినిమాకు 4 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. అంద‌రి కంటే భిన్నంగా సినీ విమ‌ర్శ‌కుడు క‌మాల్ ఆర్ ఖాన్ విమ‌ర్శ‌లు దిగ‌డం గ‌మనార్హం.

ఆయ‌న ఈ సినిమాపై నీచమైన కామెంట్స్ చేశారు. ట్విటర్ వేదిక‌గా తన రివ్యూని పోస్ట్ చేశారు. సినిమా చూసిన అరగంటలోపే అసలు ఏం జరుగుతోందో అర్థంకాలేద‌ని, ఇక ఇంటర్వెల్‌కి వచ్చేసరికి సినిమా గురించి తాను ఒక్కటే చెప్పగలన‌ని, థూ. అని, సినిమాను వినోదం కోసం చూస్తాను. కానీ చివరి వరకు బోర్ కొట్టి చావడానికి కాద‌ని ఘాటుగా స్పందించారు. థప్పడ్’ సినిమాతో మగవాళ్లకు, ఆడవాళ్లకు, సమాజానికి ఎలాంటి సంబంధంలేద‌ని, దర్శకుడు అనుభవ్ సిన్హా తన వ్యక్తిగత జీవితాన్ని సినిమాగా మార్చార‌ని విమ‌ర్శించారు. అదీగాక అనుభవ్ సర్.. మా పబ్లిక్ జీవితం మీలాగా లేదు. మేం రెండు రూపాయల చిల్లరగాళ్లం. మీరు ఉన్నతమైన వ్యక్తి. కాబట్టి మీ జీవితాన్ని మీ వద్దే ఉంచుకోండి’ అని ట్వీట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అంతేకాదు క‌మ‌ల్‌పైనా అదే స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Tags: anubhav sinha, kamal r khan comment, thappad, thapsi pannu