నేను ఇంకా పెళ్లీ చేసుకోలేదు: దిల్ రాజు

సినీ పరిశ్రమకు చెందిన వారి మీద వచ్చిన పుకార్లు మరేవరి మీదా కూడా రావు. మీడియాలో వచ్చే గాసిప్స్ ఒక్కోసారి హద్దులు దాటుతుంటాయి. సంబంధిత వ్యక్తులను ఎంతో మనోవేదనకు గురిచేస్తుంటాయి. తమ తప్పు, ప్రమేయం లేకున్నా బయచికి వచ్చి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలా ఎందరో నటీనటీనటులు వాటి బారిన పడ్డారు. తాజాగా విజయవంతాల చిత్రాల నిర్మాత దిల్ రాజు కూడా ఆ జాబితాలో చేరిపోవడం గమనార్హం.

విషయం ఏమిటంటే.. దిల్ రాజు భార్య అనిత అనారోగ్యంతో  మూడేళ్ల క్రితం మృతి చెందారు. వారికి ఒక అమ్మాయి. ఆమెకూ వివాహామైంది. దీంతో ఆయన అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే ఆయన రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ఇటీవల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒక ఆంగ్ల పత్రికయితే దిల్ రాజు పెళ్లి చేసుకుంది 30 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ అని, కూతురితో సహా కూతురుతో సహా కుటుంబ సభ్యులందరి సమక్షంలో షంశాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని హోటల్లౌ పెళ్లి చేసుకున్నారని ఓ కథనాన్ని వడ్డి వార్చింది. ఇంకే సోషల్ మీడియాలో అది తెగ వైరల్ గా మారింది. అలా ఆ నోటా ఈ నోట నుంచి అది కాస్తా రాజు చెవిన పడింది. దీంతో ఆయన ఎంతో ఆవేదన చెందారు. ఆ కథనంపై స్పందించారు. అంతేకాకుండా తన పెళ్లి విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని, ఒక వేళ చేసుకుంటే అందరికీ చెప్పి చేసికుంటానని కుండ బద్డలు కొట్టారు. పెళ్లి వార్తలకు చెక్ పెట్టారు.

Tags: DilRaju, Gossips, Second Marriage, Tollywood