బాల‌య్యపై త‌మ‌న్నా స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్‌…. ఇన్నాళ్ల‌కు నాటి కోరిక నెర‌వేర్చుకుందా…!

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న NBK 108 సినిమాలో కాజల్ హీరోయిన్ గా, శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య రెండు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడ‌తాడ‌న్న కాన్ఫిడెంట్ అంద‌రిలోనూ ఉంది. ఈ సినిమా నుంచి ఇటీవ‌ల రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న రిలీజ్ చేయబోతున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Tamannaah : స్టార్ హీరో సినిమాలో మరో ఐటెం సాంగ్‌కు ఓకే చెప్పిన తమన్నా.. ఈ  సారి మాత్రం అంతకు మించి.. | Tamannaah item Song With Balakrishna Gopichand  Malineni Movie Here Are The ...

దీంతో పాటే ఈ సినిమాకు మరింత హైప్ పెంచడానికి స్పెషల్ సాంగ్ కూడా యాడ్ చేస్తున్నాడు అనిల్ రావిపాడు. మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ ఈ సాంగ్ కంపోజ్ చేశాడట. ఈ సాంగ్‌లో బాల‌య్య‌కు జోడీగా స్టెప్పులు వేసేందుకు మిల్కీబ్యూటీ తమన్నాని తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు తమన్నాకు రు. 1.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నార‌ట‌.

ఇదిలా ఉంటే త‌మ‌న్నా నాలుగేళ్ల క్రితం పైసా వ‌సూల్ సినిమాలోనే బాల‌య్య‌తో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. ఆ టైంలో ఆమె బాలీవుడ్‌లో బిజీ షెడ్యూల్స్‌తో ఉండ‌డంతో వ‌దులుకుంది. బాల‌య్య గారితో న‌టించే అవ‌కాశం ఎదురు చూస్తున్నా అంటూ త‌న ఆస‌క్తి ఆనాడే బ‌య‌ట‌పెట్టింది. అయితే ఇప్పుడు ఎట్ట‌కేల‌కు త‌మ‌న్నా కోరిక తీర‌నుంది.

Tamannaah : స్టార్ హీరో సినిమాలో మరో ఐటెం సాంగ్‌కు ఓకే చెప్పిన తమన్నా.. ఈ  సారి మాత్రం అంతకు మించి.. | Tamannaah item Song With Balakrishna Gopichand  Malineni Movie Here Are The ...

డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి సెంటిమెంట్ ప్రకారం తను ముందు సినిమా హీరోయిన్ ని ప్ర‌జెంట్ సినిమాలో ఏదో ఒక చిన్న పాత్రలోనైనా తీసుకుంటూ ఉంటాడు. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలంటే కచ్చితంగా తమన్నాని ఈ సినిమాకి స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.