బుల్లితెరపై ‘ బ‌లగం ‘ సెన్సేషనల్ రికార్డు… స్టార్ హీరోల‌కే లేని రికార్డ్‌తో అద‌ర‌గొట్టిందిగా…!

ఈ సంవ‌త్స‌రం వ‌చ్చిన చిన్న సినిమాలో బ్లాక్ బస్ట‌ర్ హిట్‌గా నిలిచిన సినిమాలో బ‌ల‌గం ఒక‌టి.. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కొత్త టాలెంట్ ఆద‌రించ‌డానికి త‌న వార‌సులైన హ‌ర్షిత్, హన్షిత‌ల‌తో ఈ సినిమాను నిర్మింపజేశారు. తెలంగాణ‌లోని సిరిసిల్ల స‌మీపంలోని ఓ పల్లెటూరు బ్యాక్డ్రాప్‌తో బ‌ల‌గం సినిమాను రూపొందించారు. క‌మెడియ‌న్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన వేణు ఎల్దండి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మార‌డం మ‌రో విశేషం.

Balagam Movie Review

ఎలాంటి అంచనాల్లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మొద‌టి ఆట నుంచి సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్ర‌ధానంగా తెలంగాణ‌లో ఓ వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత ఎలాంటి సాంప్ర‌దాయాలుంటాయి… ఆ క్ర‌మంలో కుటుంబ స‌భ్యులు, చుట్టూ ఉన్న వారు ఎలా స్పందిస్తారు? కుటుంబ స‌భ్యుల మ‌ధ్య బంధాలు, బంధుత్వాలు ఎలా ఉంటాయ‌నే ? క‌థాంశంతో బ‌ల‌గం సినిమాను తెర‌కెక్కించారు.

ఈ సినిమాలో ప్రియ ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్‌గా న‌టించారు. ఈ సినిమాలో దాదాపు ఎక్కువ మంది న‌టీన‌టులు కొత్త‌వారే న‌టించారు. చాలా తక్కువ బడ్జెట్‌తో వ‌చ్చిన‌ ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు రూ.30 కోట్లకు పైగానే క‌లెక్ష‌న్లు సాధించి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమా ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై కూడా తెలుగు వారి స‌త్తా చాటింది.

Low-budget Tollywood movie 'Balagam' gets two LACA awards | Telugu Movie News - Times of India

ఇప్పుడు ఈ సినిమా బుల్లి తెర‌పై కూడా అదిరిపోయే రికార్డ్‌ను క్రియెట్ చేసింది. బ‌ల‌గం సినిమా రీసెంట్‌గా స్టార్ మాలో ప్ర‌సార‌మైంది. తోలిసారిగా ఈ సినిమాకి బుల్లి తెర‌పై ఏకంగా 14.3 టీఆర్పీ వచ్చింది. రీసెంట్ టైమ్స్ లో స్మాల్ స్క్రీన్ లో ప్రసారమైన సినిమాల్లో ఇదే అత్యథికం.. అంతే కాకుండా ఈ సినిమాకు హైద‌రాబాద్ సెగ్మంట్‌లో అయితే ఏకాంగా సినిమాకు 22 టీఆర్‌పీ రావ‌టం హాట్ టాపిక్‌గా మారింది.

రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమాలు కి కూడా ఈ స్థాయిలో రేటింగ్ రావటం కష్టంగా మారింది. థియేటర్లో సక్సెస్ అయినంతగా స్మాల్ స్క్రీన్ పై ఏ సినిమా సక్సెస్ అవడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టీవీల్లోకి వచ్చిన బలగం సినిమా సెన్సేషనల్ టీఆర్పీ సాధించింది. ఈ సినిమా వెండితెర‌తో పాటు బుల్లి తెర‌పైకూడా సూప‌ర్ హిట్‌గా నిలిచింది.