ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సాయి తేజ్ మూవీ టైటిల్ వ‌చ్చేసింది.. భ‌లే ట్విస్ట్ ఇచ్చారుగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ‌రియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ వినోదయ సీతం. కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని కోలీవుడ్‌ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో ఈ రీమేక్‌గా తెరకెక్కుతుంది.

తమిళ్‌లో కూడా సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేసి నటించిన ఈ సినిమా అక్కడ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో స‌ముద్ర‌ఖ‌ని దర్శకత్వంలోనే ఇక్కడ కూడా సినిమా చేస్తున్నారు. ఒరిజినల్ లో సముద్రఖని చేసిన పాత్రనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగులో చేస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన షూట్ ను పూర్తి చేసాడు.

Sai Dharam Tej to join hands with Pawan Kalyan for Telugu remake of 'Vinodhaya Sitham' | Telugu Movie News - Times of India

దాదాపు 80 శాతం వరకు షూట్ పూర్తి అయినట్టు తెలుస్తుంది.. మిగిలిన షూటింగ్ కూడా శరవేగంగా గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నారు. ఈ రోజు ముందుగా చెప్పిన‌ట్టుగానే ఈ సినిమా టైటిల్‌ను మేక‌ర్స్ రీలిజ్ చేసారు. ఇక సినిమాకు బ్రో అనే టైటిల్‌ను పెట్టారు. ఈ బ్రో అనే టైటిల్‌పై ముందు నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో ప‌వ‌న్ దేవుడిగా క‌నిపించ‌బోతున్నాడు. ఇక జూలై 28న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.