మ‌ళ్లీ దొరికేసిన థ‌మ‌న్‌.. ‘ గుంటూరు కారం ‘ మ్యూజిక్ కూడా ఆ సినిమా ట్యూన్ ఎత్తేసి మ‌రీ..!

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా గుంటూరు కారం. నిన్న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఓ చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ గా మారింది. ఈ సినిమాకి మ్యూజిక్ టాలీవుడ్ సెన్సేషన్ థ‌మన్ అందిస్తున్నాడు.

Guntur Kaaram: మహేష్ అభిమానులకు థమన్ భరోసా.. ఆ విషయంలో ప్రామిస్ చేసిన  మ్యూజిక్ డైరెక్టర్.. - Telugu News | Music Director Thaman Promise to Super  Star Mahesh Babu Fans about Guntur Kaaram ...

తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కావ‌డంతో సోషల్ మీడియాలో థ‌మ‌న్‌పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో గుంటూరు కారం గ్లింప్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కాపీ కొట్టాడ‌ని ట్రోలింగ్ భారీగా జ‌రుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ ప్రకారం కోలీవుడ్ లో నయనతార భర్త విగ్నేష్ శివన్ తెరకెక్కిచ్చిన కె ఆర్ కె సినిమా నుంచి ఈ మ్యూజిక్ కాపీ కొట్టినట్లు థ‌మ‌న్‌ను ఆడేసుకుంటున్నారు.

Thaman: మహేష్ బాబు 'గుంటూరు కారం' నుండి థమన్ అవుట్.. క్లారిటీ ఇచ్చిన థమన్!

కె ఆర్ కే సినిమాలోని ఓ ట్యూన్‌, గుంటూరు కారం గ్లింప్స్ ట్యూన్ వింటే థ‌మ‌న్ కాపీ కొట్టాడ‌న్న విష‌యం
క్లియర్గా అర్థం అయిపోతోంది. మ్యూజిక్ సౌండ్స్ మొత్తం ఆ సినిమా నుంచి కాపీ చేశాడంటూ మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. థ‌మ‌న్ ఏ మాత్రం ఒళ్లు వంచ‌డం లేద‌ని.. కాపీ ట్యూన్ల‌కు అల‌వాటు ప‌డిపోయాడంటూ మ‌హేష్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ జ‌నాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Mahesh Babu: తమన్ మీద ఎందుకు మహేశ్ కి చిరాకు కలిగింది..? అసలేం జరుగుతోంది?

అయినా మ‌నోడు మార‌డం లేదు. ఈ గుంటూరు కారం గ్లింప్స్‌లో మహేష్ బాబు మాస్ అండ్ సాఫ్ట్ లుక్ లో అదరగొట్టాడు. దీంతో ఈ సినిమాపై ఆయన అభిమానులో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ? రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.