చిరంజీవి, బాల‌కృష్ణ క‌లిసి న‌టించిన సినిమాకు మీకు తెలుసా… ఈ కాంబినేష‌న్ ఎలా ఫిక్స్ అయ్యిందంటే..!

మన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రెండో తరం హీరోలంటే ముందుగా గుర్తుకు వచ్చే వారు నట‌సింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున. టాలీవుడ్ లో ఈ నలుగురు సీనియర్ హీరోలకు ఎంతటి క్రేజ్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఇప్ప‌టికీ ఈ నలుగురు హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నేటి తరం హీరోలకు పోటీ ఇస్తున్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ నలుగురు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమాలో నటించారు.

TRIMURTHULU | TELUGU FULL MOVIE | VENKATESH | ARJUN | RAJENDRA PRASAD |  TELUGU MOVIE ZONE - YouTube

సాధారణంగా ఇద్దరు అగ్ర హీరోలు ఒక తెరపై కనిపిస్తే అభిమానులు ఎంతో ఆనందిస్తారు. అలాంటిది నలుగురు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి సందర్భమే గతంలో ఒకసారి ఎదురయింది. వెంకటేష్, బాలయ్య, నాగార్జున, చిరంజీవి కలిసి ఒక సినిమాలో నటించారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే వెంకటేష్ హీరోకి వచ్చిన త్రిమూర్తులు.

ఇక ఈ సినిమాను కె. మురళీమోహనరావు తెరకెక్కించగా.. వెంకటేష్‌కు జంటగా స్టార్ హీరోయిన్ ఖుష్బూ ఈ సినిమాలో నటించింది. బాలీవుడ్ లో 1981 లో వచ్చిన సూపర్ హిట్ సినిమా నసీబ్ కు ఈ సినిమా రీమేగా తెలుగులో వచ్చింది. ఈ సినిమాలో వచ్చే ఓ ముఖ్యమైన పాటలో నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించారు. వీరితో పాటు సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, విజయశాంతి, రాధిక, రాధా వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ పాటలో కనిపించి అలరించారు.

All Telugu Star Heroes In a Song || Trimurthulu movie Song || Skydream  Cinema || - YouTube

అయితే భారీ అంచనాల మధ్య 1987లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. కానీ ఈ ఒక్క సినిమాలోనే వెంకటేష్, బాలయ్య, చిరంజీవి, నాగార్జున కలిసి కనిపించడం అప్పట్లో సంచలంగా మారింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఈ నలుగురు కలిసి మరో సినిమాలు కనిపించలేదు.