Telugu Heroes : బాలీవుడ్ మార్కెట్ లో తెలుగు హీరోల కొట్లాట..!

ప్రస్తుతం తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్ ని శాసిస్తున్నాయంటే నమ్మాల్సిందే. బాహుబలి తర్వాత తెలుగు సినిమాల వెయిట్ పెరిగింది. ఆ మేనియాని కొనసాగిస్తూ సౌత్ సినిమాలు (Telugu Heroes ) హిందీలో సత్తా చాటుతున్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన పుష్ప కూడా హిందీలో 100 కోట్లని కలెక్ట్ చేసింది. ఇక ఈమధ్య ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తికేయ 2 కూడా బాలీవుడ్ లో అదిరిపోయే కలక్షన్స్ సాధిస్తుంది.

రెండు వారాలు అవుతున్నా బాలీవుడ్ లో కార్తికేయ 2 సందడి కొనసాగుతూనే ఉంది. ఇక లేటెస్ట్ గా ఈరోజు విజయ్ దేవరకొండ లైగర్ రిలీజ్ అయ్యింది. ఓ పక్క బాలీవుడ్ హీరోల సినిమాలు బాయ్ కాట్ చేస్తూ అక్కడ ఆడియెన్స్ Telugu Heroes తెలుగు సినిమాలకు బ్రహ్మరధం పడుతున్నారు. లైగర్ తెలుగు రాష్ట్రాల్లో టాక్ యావరేజ్ గా అనిపించినా హిందీలో మాత్రం హిట్ అవుతుందని అంటున్నారు.

మొత్తానికి ఈ వారం హిందీ బాక్సాఫీస్ పై లైగర్ తో విజయ్, కార్తికేయ 2తో నిఖిల్ తమ సత్తా చాటనున్నారు. ఓవిధంగా ఇది తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి తరుణమని చెప్పొచ్చు.

Tags: Bollywood, Bollywood Boxoffice, karthikeya 2, liger, Nikhil, Telugu Heroes, Vijay Devarakonda