దాదాపు పాతికేళ్ల కిందట కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన నరసింహా సినిమాను ఎవరు మర్చిపోరు. రజినీకాంత్ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచింది. నా దారి రహదారి అంటూ ఈ మూవీలో రజినీకాంత్ చేసిన హంగామా మామూలుగా ఉండదు. ఒక్క తమిళనాడులోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రజినీకాంత్ తో తలపడే విలన్ పాత్రలో రమ్య కృష్ణ నటించింది.
తాను ప్రేమించిన వ్యక్తి నుంచి తిరస్కరణ గురై అతనిపై పగ తీర్చుకునే నీలాంబరి క్యారెక్టర్లో రమ్యకృష్ణ నటించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ రజనీకాంత్ కు పోటా పోటీగా నటించి లేడీ విలన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఇప్పుడు రజనీకాంత్ కు మరోసారి రమ్యకృష్ణ విలన్ గా నటించనుంది.
ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు ఈ సినిమాను నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ సంస్థ వెల్లడించింది. మరోసారి రజనీ కాంత్, రమ్యకృష్ణ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా జైలర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో తమన్నాది చిన్న గెస్ట్ రోల్ మాత్రమేనని తెలుస్తోంది.