న‌ట వార‌సులే కాదు.. అదే బాట‌లో వీరి వార‌సులూ వ‌స్తున్నారు

తెల‌గు చిత్రసీమ‌నే కాదు.. హాలివుడ్ మొద‌లు బాలివుడ్ వ‌ర‌కు వార‌స‌త్వం కొన‌సాగుతున్న‌ది. ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఇందులో చాలా మంచి న‌టులు, వారి కుటుంబీకులు మాత్ర‌మే ఉండేవారు. హీరోల పుత్రులు హీరోలుగా మాత్ర‌మే ఇండ‌స్ర్టీకి వ‌చ్చేవారు. వారి నుంచి హీరోయిన్లుగా వచ్చిన వారి సంఖ్య మాత్రం చాలా త‌క్కువ‌. ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారిపోతున్న‌ది. న‌టుల వార‌సులే కాదు వారి ఇంటి ఆడ‌బిడ్డ‌లు కూడా తెర‌గెట్రం చేస్తున్నారు. వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుంటున్నారు. అదేవిధంగా సినీ రంగంతో సంబంధంమున్న ప్ర‌తి విభాగం నుంచి కూడా చిత్ర‌సీమలో వార‌స‌త్వ కార్డును ఉప‌యోగించుకుని కొంద‌రు ఎంట్రీ చేస్తున్నారు. వీరిలో కొంద‌రు త‌మ టాలెంట్‌ను ప‌దును పెట్టుకుని నిల‌దొక్కుకుంటుంటే, మ‌రికొంద‌రు మాత్రం వ‌చ్చినంత వేగంగా తెర‌మ‌రుగ‌వుతున్నారు. ఇండస్ర్టీని నుంచి త‌ప్ప‌కుంటుండ‌డం గ‌మనార్హం. మ‌రి ప్ర‌స్తుతం సినీ ప్ర‌పంచంలోకి ఏ ఏయే విభాగాల నుంచి వార‌సులు వ‌చ్చారు? వారు ఎవ‌రు?   వారు రాణిస్తున్నారా?  వారు సాధించిన విజ‌యాలేమిటి?  అన్న విష‌యాల‌ను తెలుసుకుందాం.

మొద‌ట‌గా.. ఇందులో సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి కుటుంబం గురించి ప్ర‌స్తావించుకోవాలి. ఈయ‌న కుటుంబం నుంచి గ‌తంలో ఆయ‌న సోద‌రి ఎంఎం శ్రీెలేఖ సినీ రంగ ప్ర‌వేశం చేశారు. కొన్ని సినిమాల‌కు బాణిల‌ను అందించారు. అనంత‌రం తెరమ‌రుగ‌య్యారు. ఇప్పుడు తాజాగా కిర‌వాణి కుమారులు ఇద్ద‌రూ సినీ రంగ ప్ర‌వేశం చేశారు. అదీ ఒకే సినిమాతో కావ‌డం విశేషం. మ‌త్త‌వ‌ద‌లారా సినిమా హీరోగా ఆయ‌న  శివ కోడూరి చేస్తే. అదే సినిమాకు ఆయ‌న మ‌రోకుమారుడు కాల భైర‌వ సంగీతాన్ని స‌మ‌కూర్చాడు. సినిమా ఆశించిన స్థాయిలో లేక‌పోయినా మొత్తం వార‌యితే ఎంట్రీ ఇచ్చారు. ఇక మ‌రో ద‌ర్శ‌కుడు, మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ కుమారుడు మ‌హితీసాగ‌ర్ కూడా సినీ రంగ ప్ర‌వేశం చేశారు. నాగ‌శౌర్య సినిమా జాదుగాడు మూవీకి బాణీల‌ను స‌మ‌కూర్చాడు.  మ‌రో సంగీత దర్శకుడు రాజు కొడుకు రాజీవ్‌ హీరోగా తెరపైకి వచ్చాడు. అదే విధంగా గ‌తంలో సంగీతం చ‌క్ర‌వ‌ర్తి కుమారుడు శ్రీ కూడా సినిమా రంగంలోకి వ‌చ్చినా అనంత‌రం అనారోగ్య కార‌ణాల‌తో మృతి చెందాడు. కానీ ప్ర‌స్తుతం ఆయ‌న కుమారుడు సంగీతం శ్రీ చ‌క్ర‌వ‌ర్తి తెలుగు తెర‌కు హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు.  ఏఆర్ ర‌హ‌మాన్ మేన‌ల్లుడు జీవీ ప్ర‌కాశ్ కూడా మామ బాట‌లోనే సంగీత ద‌ర్శ‌కుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టాడు. కానీ, ఆయ‌న పూర్తికాలం సంగీత ద‌ర్శ‌కుడిగా కొన‌సాగ‌లేదు. కొంత‌కాలంగా హీరో పాత్రలు వేస్తున్నాడు.

అదే విధంగా చిత్ర ద‌ర్శ‌కుల వార‌సులు సైతం సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. ఇక్క‌డ ముఖ్యంగా తెలుగు చిత్ర సినిమా ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన రాజ‌మౌళి గురించి చెప్పుకోవాలి. ఆయ‌న కుటుంబం నుంచి న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు తెరంగెట్రం చేస్తున్నాడు.  రాజమౌళి కుమారుడు కార్తికేయ ఇప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాహుబలి సినిమాకు పనిచేసి తండ్రి ప్రశంసలందుకున్నాడు కూడా. ద‌ర్వ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ గ‌తంలో త‌న సోద‌రుడు సాయిరాంను ప‌రిచ‌యం చేయ‌గా, కుమారుడిని కూడా హీరో తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. సినీ తెర‌కు న‌టుల వార‌సులు వ‌చ్చినంత‌గా వారి కుటుంబం నుంచి అమ్మాయిలు మాత్రం రావ‌డం లేదు. ప్ర‌స్తుతం ఆ ట్రెండ్‌కు బ్రేక్ ప‌డింది. ఇప్ప‌టికే క‌మ‌లాస‌న్ కూతురు శృతిహాస‌న్, శ్రీదేవి కూతురు జాన్మీక‌పూర్‌, సునిల్‌శెట్టి కుమార్తె అతియా శెట్టి, పైఫ్ అలిఖాన్ కుమార్తె సారా అలిఖాన్ సినీ రంగంలోకి ప్ర‌వేశించారు. తెలుగు సినిమాలోనూ ఆ ట్రెండ్ మొద‌లైంది. రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాత్మిక‌,  మెగ‌స్టార్ కుటుంబం నుంచి  నిహారిక కొణిదెల చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టారు.

అంద‌రూ తామేం త‌క్కు అనుకున్నారో ఏమో క‌మెడియ‌న్లు సైతం త‌మ వార‌సుల‌ను చిత్ర సీమ‌లోకి తీసుకొస్తున్నారు. వారిలో మొద‌ట ఎంఎస్ స‌త్య‌నారాయ‌ణ కొడుకు విక్రం ఇలా వ‌చ్చాడు అలా వెళ్లాడు. మ‌రో క‌మెడియ‌న్, స‌హ క్యారెక్ట‌రిస్టు బ్రహ్మజీ కుమారుడు సంజయ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అదే బాట‌లో చిత్ర నిర్మాత‌ల వార‌సులు కూడా అడుగుపెడుతున్నారు.  తెలుగు ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ వ‌న్ నిర్మాతగా ఉన్న‌ దిల్ రాజు త‌న సోదరుడు శిరీష్ తనయుడు ఆశీష్‌ రెడ్డిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు. అదేవిధంగా ప్రొడ్యూస‌ర్ బెల్లంకొండ సురేష్ త‌న కుమారు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌ను హీరోగా ప‌రిచ‌యం చేశాడు. ఇలా ఇంకా ఎంతో మంది ఆయా విభాగాల్లో పేరు తెచ్చుకున్న ప్ర‌ముఖులు త‌మ వార‌సుల‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు.

 

 

Tags: directors, heroins, Heros, music directors, telugu cinema