Tejaswi : తనని కమిట్మెంట్ అడగాలంటే భయపడే వారు.. ఎలాంటి పాత్రలకైనా రెడీ..!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక్క డైలాగ్ తో పాపులర్ అయిన తేజశ్వి మడివాడ (Tejaswi ) ఆ తర్వాత ఆర్జీవి ఐస్ క్రీం సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ షోతో అమ్మడు మరింత ప్రేక్షకులకు దగ్గరైంది. బోల్డ్ గా నటిణడానికి తాను రెడీ అని చెబుతున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా కమిట్మెంట్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా అమ్మడు హాట్ సీన్స్ లో నటించింది. ఇక ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి ఈ సినిమాలో ప్రస్థావిస్తారని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజశ్వి తనని కమిట్మెంట్ అడగాలంటే భయపడేవారని. ఇక కంటెంట్ బాగుంటే తాను ఎలాంటి పాత్రలో నటించడానికైనా రెడీ అంటుంది తేజశ్వి (Tejaswi ). అంతేకాదు ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ ఇవన్ని కూడా ఓకే అంటుంది. తేజశ్వి ఈ రేంజ్ ఆఫర్ ఇస్తే ఇక దర్శక నిర్మాతలు వెంట పడతారని చెప్పొచ్చు.

కమిట్మెంట్ సినిమా ఆగష్టు 19న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టీజర్ సినిమాపై క్రేజ్ ఏర్పరచింది. తేజశ్వి మడివాడ తో పాటుగా మరో ఇద్దరు భామలు ఈ సినిమాలో నటించారు.

Tags: Commitment, Ice cream, Tejaswi, Tejaswi Madivada, Tollywood