NTR : నెంబర్ 1 ఎన్.టి.ఆర్.. ఆ తర్వాతే ఎవరైనా..!

ప్రముఖ నేషనల్ మీడియా ఆర్మాక్స్ ఇండియా సినీ సెలబ్రిటీస్ లో అత్యధిక పాపులారిటీ కలిగిన లిస్ట్ ని రిలీజ్ చేసింది. జూలై నెలలో మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో నెంబర్ పొజిషన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ (NTR) ఉన్నాడు. ఆర్.ఆర్.ఆర్ ఓటీటీలో రచ్చ చేస్తున్న టైం లో ఎన్.టి.ఆర్ గురించి నేషనల్ లెవల్ లో చర్చ జరుగుతుంది. ఆ సినిమాలో తారక్ కొమరం భీం పాత్రలో అదరగొట్టాడు. ఆర్మాక్స్ నేషనల్ మీడియా మోస్ట్ పాపులారిటీ లిస్ట్ లో ఎన్.టి.ఆర్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ప్రభాస్ ఉన్నాడు.

ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో అల్లు అర్జున్, నాల్గవ ప్లేస్ లో చరణ్, ఐదవ స్థానంలో మహేష్ ఉన్నారు. ఈ లిస్ట్ లో ఆరవ స్థానంలో నాని, ఏడవ స్థానంలో పవన్ కళ్యాణ్, ఎనిమిదవ స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నారు. ఈ లిస్ట్ లో టాప్ 9వ పొజిషన్ లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. 10వ ప్లేస్ లో మాస్ మహరాజ్ రవితేజ ఉన్నారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటించిన ఎన్.టి.ఆర్ (NTR) ఆర్మాక్స్ మీడియా పాపులర్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా అదే సినిమాలో అల్లూరిగా నటించిన చరణ్ నాల్గవ స్థానంలో ఉన్నారు.

 

Tags: mahesh, ntr, Ormax, Ormax Media, Prabhas, ram charan, RRR, Telugu Stars, Tollywood