Adithi : కూతురికి వార్నింగ్ ఇచ్చిన డైరక్టర్ శంకర్..!

డైరక్టర్ శంకర్ కూతురు అదితి (Adithi) శంకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కార్తీ విరుమాన్ సినిమాలో ఆమె నటించింది. సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత అదితి (Adithi) శింబు హీరోగా నటిస్తున్న సినిమాకు సైన్ చేసినట్టు టాక్. శంకర్ కి తెలియకుండా ఆమె ఆ సినిమాకు సైన్ చేసిందట. కరుణ్ కుమార్ డైరక్షన్ లో శింబు హీరోగా రాబోతున్న సినిమాకు అదితిని హీరోయిన్ గా అనుకున్నారు. అయితే శింబు సినిమా అనగానే శంకర్ ఆమెని ఆ ప్రాజెక్ట్ చేయొద్దని చెప్పారట.

నువ్వు ఏ హీరోతో అయినా చెయ్యి కానీ శింబుతో మాత్రం వద్దని చెప్పారట. డైరక్టర్ డాటర్స్ హీరోయిన్స్ అవడం అంటేనే అదో పెద్ద టాస్క్. వారు ఎంత కష్టపడి నటించినా సరే హీరోయిన్స్ ని ప్రేక్షకుడు చూసే కోణం వేరేలా ఉంటుంది. అందుకే స్టార్ హీరోల డాటర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయరు. హీరోయిన్ గా కాకుండా వేరే వాటిల్లో వారిని ఇన్వాల్వ్ చేస్తారు.

అయితే శంకర్ మాత్రం తన కూతురిని హీరోయిన్ గా చేశారు. కానీ హీరోయిన్ గా చేయాలంటే మాత్రం కొన్ని కండీషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. శింబు సినిమా అయితే మాత్రం వదిలేయమని గట్టిగా చెప్పారట. మరి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్త ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

Tags: Adhithi, Director Shankar, KARTHI, Kollywood, Shankar Daughter, Simbu, Viruman