తెలుగుదేశం పార్టీ ఒక భారీ ఎత్తుగడకు రెడీ అవుతుంది. చంద్రబాబు అరెస్టు మీద ఇప్పటిదాకా జరిగిన నిరసనలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు సరికొత్త ఎత్తుతో ముఖ్యమంత్రి జగన్ ను ఇరుకు పెట్టేందుకు రెడీ అవుతోంది. టీడీపీ చంద్రబాబు అరెస్టుపై మరింత రాజకీయ కాక రగిలించేందుకు సరికొత్త ప్లానింగ్ తో ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు బాబు అరెస్టు రిమాండ్ అన్ని కలుపుకొని రెండు వారాలు అవుతోంది.
చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది. కేవలం ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ను అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలే కాకుండా భారతీయులు అందరూ చంద్రబాబు అరెస్టును ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇక ఇప్పుడు ఏపీ రాజకీయాలలో మంట పుట్టించేలా భారీ వ్యూహానికి తెలుగుదేశం పార్టీ తెరతీయనుంది. ఇందుకు ఏపీ అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది.
గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో బాబు అక్రమ అరెస్టు ప్రస్తావించడం ద్వారా చర్చకు పట్టుబట్టేందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. ఈ సమావేశాల్లో చివరి రోజున చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చంద్రబాబు మినహా మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తూ స్పీకర్కు అందజేస్తారని తెలుస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది.
మామూలుగా ఆరు నెలల్లోనే ఉప ఎన్నికలు రావాలి. ఇప్పడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు అంటే అది జగన్‌కే పెద్ద రిస్క్ అవుతుంది. అయితే స్పీకర్ ఈ రాజీనామాలు రెండు నెలలు వ్యూహాత్మకంగా పక్కన పెడితే అప్పుడు ఉప ఎన్నికలకు ఛాన్స్ ఉండదు. ఏదేమైనా ఇప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేస్త ఏపీలో పొలిటికల్ కాక మామూలుగా ఉండదనే చెప్పాలి.