జ‌గ‌న్ చెల్లి ష‌ర్మిల పార్టీ చెత్త రికార్డ్‌…!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో ఉన్న విభేదాల‌ నేపథ్యంలో సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె కిలోమీటర్ల కొలది పాదయాత్ర చేసినా తెలంగాణ ప్రజలు షర్మిల పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు పాలేరులో పోటీ చేస్తానని చెప్పినా అక్కడ అనుకున్నంత రాలేదు. చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కూడా షర్మిల రెడీ అయ్యారు. పార్టీని రెడీ చేసిన కాంగ్రెస్లో విలీనం చేసినా కూడా ఆమె కోరుకున్న పాలేరు సీటు ఆమెకు దక్కేలా లేదు.

అనూహ్యంగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు పాలేరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేయటం ఖాయం అయింది. ఇదిలా ఉంటే షర్మిల పార్టీ ఓ చెత్త రికార్డు మూట కట్టుకుంది. పార్టీ పెట్టి ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండానే మరో పార్టీలో విలీనం చేస్తుండడంతో షర్మిల ఖాతాలో పరమ చెత్త రికార్డు పడిపోనుంది. ఇదిలా ఉంటే ఆ పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గాయకుడు ఏపూరి సోమన్న పోటీకి రెడీ అయ్యాడు.

సోమన్నకు షర్మిల తుంగతుర్తి సీటు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా నిలిపివేశారు. దీంతో తనకు రాజకీయ భవిష్యత్తు లేదని నిర్ణయానికి వ‌చ్చేసిన సోమన్న బీర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఏపూరి సోమన్న రాజీనామాతో షర్మిల పార్టీలో షర్మిల తప్ప మరో నేత లేకుండా పోయినట్లయింది. మ‌రి ఇంత‌క‌న్నా చెత్త రికార్డు ష‌ర్మిల‌కు ఏం ? ఉంటుంది.