ఏపీ రోజు రోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కావాల్సిన అప్పులు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఆ మేరకు అప్పులు పుట్టడం లేదు. దీంతో సీఎం జగన్ రెడ్డి రోజు రోజుకు కష్టాల ఊబిలో కూరుకుపోతోన్న పరిస్థితి. ఇచ్చిన అప్పుల పరిమితిని వంద రోజుల్లో ఊదేసి… అదనపు అప్పుల కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే మోటార్లకు మీటర్లు పెట్టానని… సిపిఎస్ రద్దు చేయకుండా కొనసాగిస్తున్నానని కేంద్రం చెప్పిన సంస్కరణలు అన్ని అమలు చేస్తున్నానని ముఖ్యమంత్రి చెబుతున్న అప్పులు పుట్టటం లేదు.
తెరవెనక కార్పొరేషన్ల రుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని అప్పులు ఇస్తామని అనుకుంటున్నారో కానీ కేంద్రం ఇటీవల కాస్త నట్లు బిగిస్తున్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లి విధేయత ప్రదర్శించి కాస్త అప్పులకు అవకాశం తెచ్చుకోబోతున్నారన్న గుసగుసలు అయితే ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఇక జగన్ టీం గత వారం రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాస్తోంది. జగన్ అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్న ఇంకా సానుకూల ఫలితం రానట్టు తెలుస్తోంది.
అమిత్ షా అపాయింట్మెంట్ కావాలని ప్రభుత్వం తరఫున తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా… అటు నుంచి సానుకూలత రావటం లేదు. మరోవైపు దేశ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. దీంతో బిజెపి ఏపీలో తన స్టాండ్ ఎలా ? మార్చుకోబోతుంది అన్నది ఆసక్తిగా మారింది. చంద్రబాబు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్తున్నారు.. అప్పటివరకు కూడా జగన్కు అపాయింట్మెంట్ దక్కదని చెబుతున్నారు. ఆ తర్వాత ఇస్తారో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత వైసీపీకి మరింత గడ్డి పరిస్థితులు ఎదురవుతాయి అన్న చర్చ మాత్రం జోరుగా నడుస్తోంది.