తెలుగుదేశం పార్టీలో చాలామంది మహా మహులైన లీడర్లు గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. తమ తమ నియోజకవర్గాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఎంత మంచి పేరు ఉన్నా వైసిపి ప్రభంజనంలో వారు కూడా ఓడిపోక తప్పలేదు. అయితే ఓడిపోయిన వారు తమకు అలవాటు అయిన రీతిలోనే నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజల కోసమే పరితపిస్తున్నారు. ఇక అలాంటి నేతలను ప్రజలు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎందుకు ? వదులుకుంటారు.
మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగానే ఉంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వినుకొండ టీడిపి మాజీ ఎమ్మెల్యే, నరసరావుపేట జిల్లా టీడిపి అధ్యక్షులు జీవీ ఆంజనేయులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు జిల్లా రాజకీయాలలో రెండున్నర దశాబ్దాలుగా ఆయన ప్రత్యేకమైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. పల్నాడుతో పాటు నల్లమలలో ఉన్న పూర్తిగా వెనుకబడిన నియోజకవర్గం అయిన వినుకొండలో జీవి తన శివశక్తి ఫౌండేషన్ ద్వారా 25 ఏళ్ల నుంచి కొన్ని వేల సేవా కార్యక్రమాలు చేశారు.
ఆంజనేయులు సేవానిరతి గురించి ఎంత ? చెప్పుకున్నా తక్కువే. అధికారంలో ఉన్న లేకపోయినా పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ఆంజనేయులు సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం, వైయస్ రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం మధ్య బలమైన పోటీ జరిగింది. అప్పుడు ఆంజనేయులు ప్రజారాజ్యం, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బలమైన అభ్యర్థులను చిత్తుగా ఓడించి ఏకంగా 24 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 2014 ఎన్నికల్లోను ఆంజనేయులుకు మరోసారి 22 వేల మెజార్టీ వచ్చింది.
గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో తొలిసారి ఓడిపోయిన ఆయన ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి కూడా నియోజకవర్గాన్ని వదలలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం జిల్లాల విభజనలో నరసరావుపేట జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో నిత్యం ప్రజలతో మమేకమవుతు దూసుకుపోతున్నారు. స్థానిక వైసిపి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటాలు చేస్తూనే వస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్యేగా గెలిచిన రెండు సంవత్సరాలకే బ్రహ్మనాయుడు చేతులు ఎత్తేసిన పరిస్థితి.
అనంతరం శావల్యాపురం జడ్పిటిసి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హైమావతిని గెలిపించుకోవడంలో జీవి చేసిన కృషి అమూల్యం. అందుకే రాష్ట్రస్థాయిలో జీవి ఒక్కసారిగా హైలైట్ అయ్యారు. ప్రస్తుతం వినుకొండలో ఉన్న రాజకీయ సమీకరణలతో పాటు పలు సంస్థల సర్వేలలో జీవి ఈసారి 25 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో మూడోసారి సగర్వంగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉండడంతో వైసిపి బ్రహ్మనాయుడుకే సీటు ఇస్తే జీవి మెజార్టీ 30 వేలు దాటిన ఆశ్చర్యపోనవసరం లేదని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలు ప్రైవేటు ఏజెన్సీ లతో పాటు సర్వే సంస్థల నివేదికల్లోనూ ఇదే విషయం వెళ్లడవుతున్న పరిస్థితి.