టీడీపీ వన్‌సైడ్‌గా గెలిచే వైసీపీ కంచుకోట ఇదే..!

అది వైసీపీ కంచుకోట..అసలు టీడీపీకి పెద్దగా పట్టు లేని స్థానం..గత ఐదు ఎన్నికల నుంచి టీడీపీకి విజయం లేని స్థానం..అలాంటి చోట ఇప్పుడు టీడీపీ లీడ్ లోకి వచ్చింది..వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ వెళుతుంది. ఈ సారి అక్కడ టీడీపీ వన్ సైడ్ గా గెలిచేయడం ఖాయం. అలా వన్ సైడ్ గా గెలిచేసే సీటు ఏదో కాదు..ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బొబ్బిలి స్థానం.

Bobbili YSRCP MLA Sambangi Venkata China Appala Naidu on English Medium Bill || Assembly Day 4 - YouTube

అసలు బొబ్బిలిలో టీడీపీకి పెద్ద పట్టు లేదు. ఏదో 1983, 1985, 1994 ఎన్నికల్లోనే అక్కడ టి‌డి‌పి గెలిచింది. టి‌డి‌పి నుంచి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు గెలిచారు. ఇంకా అంతే తర్వాత నుంచి అక్కడ టి‌డి‌పి గెలవలేదు..1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే రెండుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచి…2014లో వైసీపీ నుంచి గెలిచిన సుజయ కృష్ణరంగరావు…తర్వాత టీడీపీలోకి వచ్చారు.

ఇక టి‌డి‌పిలో ఉండే శంబంగి వైసీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో వీరి మధ్యే పోరు జరిగింది. విజయం శంబంగిని వరించింది. ఎప్పుడో టి‌డి‌పి లో మూడుసార్లు గెలిచిన శంబంగి మళ్ళీ ఇప్పుడు గెలిచారు. అయితే శంబంగి అనుకున్న విధంగా బొబ్బిలిలో పనిచేయలేదు..రోజురోజుకూ ప్రజా వ్యతిరేకత పెంచుకున్నారు. అటు టి‌డి‌పి నుంచి సుజయ సోదరుడు బేబీ నాయన బొబ్బిలి బాధ్యతలు చూస్తున్నారు.

ElectWise.in | ElectWise

టి‌డి‌పిని అనూహ్యంగా బలోపేతం చేశారు. బొబ్బిలి మున్సిపాలిటీ ఎన్నికలో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుతానికి బొబ్బిలిలో టి‌డి‌పిని ఆధిక్యంలోకి తీసుకొచ్చారు. ఈ సారి ఎన్నికల్లో అక్కడ టి‌డి‌పి గెలవడం ఖాయమనే పరిస్తితి వచ్చింది. వైసీపీ అభ్యర్ధిని మార్చిన సరే బొబ్బిలిలో పసుపు జెండా ఎగరడం ఆపడం కష్టమే.