వామ్మో.. ఆ స్టార్ హీరోతో కోరిక తీర్చుకుంటానంటోన్న ప్రియ‌మ‌ణి… !

ఒక‌ప్పటి స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరే అతగాడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రియమణి తెలుగులోనే కాక తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ వంటి మరిన్ని భాషల్లో నటించింది. ఈ సినిమా హీరో వ‌ల్ల‌భ ఎవ‌రో కాదు ప్ర‌ముఖ నిర్మాత కేఎస్‌. రామారావు కుమారుడు. ఎప్పుడో 2002లోనే ఈ సినిమా వ‌చ్చింది.

 

Actress Priyamani White Saree Images @ Custody Pre Release

టాలీవుడ్ లోని చాలామంది అగ్ర హీరోలతో నటించిన ప్రియమణి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. కమర్షియల్ సినిమాల అందాల ఆరబోతల్లో ఏమాత్రం తగ్గకుండా నటించింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లయిన తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ప్రియమణి. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి తన మనసుకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో కొనసాగుతుంది. ఇటీవల నాగచైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కనున్న కస్టడీ సినిమాలో సీఎం పాత్రలో నటించింది.

Chiranjeevi, the megastar who beat Big B as India's highest paid actor - Hindustan Times

అందులో భాగంగా కస్టడీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో ప్రియమణి సందడి చేసింది. గతంలోనే నాగచైతన్యతో ఒక సినిమాలో నటించిన ప్రియమణి మళ్లీ కస్టడీ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియమణి మాట్లాడుతూ వెంకట్‌ ప్రభు లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తీసిన‌ కస్టడీ సినిమాలో తనకు పాత్ర ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది.

Custody Pre Release Event Photos

ప్రతి సన్నివేశాన్ని డైరెక్టర్ గారు ఎంతో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని చెప్పుకొచ్చింది. అదే సమయంలో ప్రియమణి మాట్లాడుతూ బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ నటులతో నటించిన నేను మెగాస్టార్ చిరంజీవి గారితో మాత్రం ఇప్పటివరకు ఏ సినిమాలో నటించలేద‌ని.. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే నా కోరిక తీర్చుకుంటానంటూ తన మనసులోని విషయాన్ని బయట పెట్టింది ప్రియమణి.