స‌మంత కొత్త ఇల్లు రేటు చూస్తే దిమ్మ‌తిరిగిపోతోంది… త‌గ్గేదేలే…!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ స‌మంత‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత నాగచైతన్య ను వివాహం చేసుకొని కొద్ది సంవత్సరాలకే విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ బిజీ గా షూటింగ్స్ లో గడుపుతుంది. ఇటీవల సమంత నటించిన పాన్ఇం డియా సినిమా శాకుంతలం ఫ్లాప్ అయినా సమంత అక్కడ ఆగిపోకుండా తర్వాత ప్రాజెక్టుల షూటింగ్స్ లో యాక్టివ్ అవుతోంది.

Samantha Luxury Life | Net Worth | Salary | Business | Cars | House | Family | Biography - YouTube

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పాటు బాలీవుడ్ లో సీటాడల్ వెబ్ సిరీస్ లో కూడా సమంత నటిస్తోంది. వీటితో పాటు సమంత చేతిలో మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం వ‌రుస సినిమా ఛాన్సులతో దూసుకుపోతున్న సమంత ఎన్నో కోట్ల విలువ చేస్తే ఆస్తులను కూడబెట్టుకుంది.

13 pictures that take you inside South star Samantha Akkineni's home in Hyderabad | Vogue India

వీటితోపాటు రంగారెడ్డి జిల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలోని జయభేరి కౌంటి గేటెడ్ కమ్యూనిటీలో ఒక‌ ఖరీదైన డూప్లెక్స్ హౌస్ సమంత కొనుగోలు చేసింద‌ట‌. సమంత తన సొంతం చేసుకున్న ఈ ఇల్లు డూప్లెక్స్ అపార్ట్మెంట్ అట. ఇంత‌కి స‌మంత‌ సొంతం చేసుకున్న ఈ ఇంటి ఖరీదు తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే ఆరు పార్కింగ్ స్లాట్లతో పాటు త్రిబుల్ బెడ్ రూమ్ లగ్జరీ గా ఉండే ఈ అపార్ట్మెంట్ దాదాపు 7.8 కోట్ల విలువ చేస్తుందట.

Walkthrough Samantha's lavish, earthy home nestled in Hyderabad

అయితే సమంతకు ఆల్రెడీ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో కోట్ల విలువ చేసే ఓ ఇల్లు ఉంది. దాంతో పాటుగా ఇటీవల 15 కోట్లు పెట్టి మరి ముంబైలో అపార్ట్మెంట్ కొనుక్కుంది. ఈ రెండు హౌస్ లే కాకుండా మరొక ఇల్లు రు. 7.8 కోట్ల విలువ పెట్టి కొన్న‌ట్టు వార్తలు వినిపించడంతో నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. మరి కొంతమంది సమంత ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.