టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో అధికార వైసీపీకి మాడు పగిలిపోయేలా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ గ్రామంలో సర్పంచ్ స్థానానికి ఉపఎన్నికి జరిగింది. మొత్తం 2800 ఓట్లు ఉండగా తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 2145 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టిడిపి బలపరిచిన అభ్యర్థి పరుచూరి విజయలక్ష్మి కి 1787 ఓట్లు పోలవగా.. వైసిపి మద్దతుతో పోటీ చేసిన శాఖమూరి రవీంద్రబాబుకు కేవలం 260 ఓట్లు మాత్రమే వచ్చాయి.
బుర్రిపాలెంలో అత్యధికంగా ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు 920 – కాపు ఓటర్లు 900 – కమ్మ సామాజిక వర్గం ఓట్లు 760 – మిగిలిన 168 మంది ఎస్టీ, బీసీలు ఉన్నారు. ఎస్సీ ఓట్లలో ఏమాత్రం వైసిపికి పడిన టిడిపి మెజార్టీ చాలా వరకు తగ్గేది. కానీ అధికార పార్టీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగానే వైసీపీకి ఎస్సీలు ఓట్లు వేయలేదని ఈ ఫలితం చెబుతోంది. తెనాలి నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే ఉన్న ఇక్కడ భారీ మెజార్టీతో టిడిపి గెలుపొందటం విశేషం.
బుర్రిపాలెం సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ జన్మించిన ఊరు కావటం విశేషం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. అలాంటి చోట ఇప్పుడు వైసీపీకి కేవలం 261 ఓట్లు మాత్రమే వచ్చాయి.. అంటే వైసిపి ప్రభుత్వం పై జనాలు ఏ స్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది.