దేశంలోని టాప్ డైరెక్టర్ల లిస్టులో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కూడా ఒకరు. శంకర్ ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు అంటే అందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. కానీ ఒకానొక సమయంలో శంకర్ తమిళ దర్శకుడు అయినా ఆ రోజుల్లోనే దేశం మొత్తం మెచ్చే సినిమాలు తీసి సెన్షేషనల్ క్రియేట్ చేశారు. జెంటిల్మెన్ – ఒకే ఒక్కడు – ప్రేమికుడు – రోబో – 2.0 ఇలా ఎన్నో సినిమాలతో సౌత్ నుంచి నార్త్ వరకు కొన్ని కోట్ల మంది సినీ ప్రేమికులను మెప్పించారు.
ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే పొలిటికల్ డ్రామా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే శంకర్ 25 సంవత్సరాల క్రితం యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా ఒకే ఒక్కడు సినిమా తెరకెక్కించారు. ఒక్కరోజు ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మనిషా కొయిరాలా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఒక సీను 400 మంది ఆర్టిస్టులతో దాదాపు 40 రోజులు సూట్ చేశారు.
సినిమాలోని మగధీర పాటను మైసూర్ ప్యాలెస్ లో చిత్రీకరించారు. ఈ పాట కోసమే అప్పట్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఆ రోజుల్లోనే రు. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఒకే ఒక్కడు కావడం విశేషం. ఒక్కరోజు సీఎం అని కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా శంకర్ పూర్తిగా రాజ్యాంగం గురించి తెలుసుకుని మరి ఈ సినిమా తెరకెక్కించటం విశేషం.
ఈ సినిమా వచ్చిన తర్వాత సినిమాలోని రఘువరన్ క్యారెక్టర్ తమిళనాడు ముఖ్యమంత్రి పోలి ఉందంటూ అక్కడక్కడ భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే అప్పటి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ సినిమా చూసి ఆయనకు పిచ్చపిచ్చగా నచ్చడంతో దర్శకుడు శంకర్‌ను పిలిపించుకుని మరీ అభినందించారు. సినిమా చాలా బాగా సినిమా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. అప్పట్లో ఇది ఒక చర్చనీయాంశం అయింది.