వైసీపీ సీనియ‌ర్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ యంగ్ లీడ‌ర్ దూకుడు…!

వచ్చే ఎన్నికల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని టి‌డి‌పి అధినేత చంద్రబాబు మొదట నుంచి చెబుతున్నా విషయం తెలిసిందే. పార్టీలో 40 శాతం సీట్లు యువతకే ఇస్తానని అంటున్నారు. అంటే టి‌డి‌పిలో యువనేత లోకేష్‌ని బలపర్చే విధంగా..యువనేతలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే పలు చోట సీనియర్లని తప్పించి..యువనేతలకు బాధ్యతలు ఇచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోవూరులో కూడా యువనేత దినేష్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు.

నారా లోకేష్ తో పోలంరెడ్డి దినేష్ రెడ్డి భేటీ

పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని తప్పించి..ఆయన తనయుడు దినేష్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇంచార్జ్ పదవి వచ్చిన దగ్గర నుంచి దినేష్ దూకుడుగా పనిచేస్తున్నారు. కోవూరులో పట్టు సాధించి..మళ్ళీ గెలవాలని చూస్తున్నారు. అయితే దినేష్ దూకుడుగానే పనిచేస్తున్నారు గాని..అక్కడ బలంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెక్ పెట్టడం సులువేనా? అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే కోవూరులో నల్లపరెడ్డి ఫ్యామిలీకి మొదట నుంచి పట్టు ఉంది.

Nallapareddy Prasanna Kumar Reddy sensational comments on tollywood| AP Cinema tickets issue : సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు, వాళ్లకు ఏపీ గుర్తుందా?| ఏపీ News in Telugu

ఆ ఫ్యామిలీ టి‌డి‌పిలోనే పనిచేసింది. నల్లపరెడ్డి తండ్రి గతంలో టి‌డి‌పిలో పనిచేశారు. ఆయన వెనుక ప్రసన్నకుమార్ రెడ్డి వచ్చారు. ప్రసన్న సైతం టి‌డి‌పిలో పలుమార్లు గెలిచారు. 1994, 1999, 2009 ఎన్నికల్లో ప్రసన్న కోవూరు నుంచి టి‌డి‌పి నుంచి గెలిచారు. కానీ 2012లో వైసీపీలోకి ఉపఎన్నికలో గెలిచారు. అయితే 2014లో ప్రసన్న వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చి టి‌డి‌పిలోకి వచ్చిన పొలంరెడ్డి గెలిచారు. ఈయన 2004లో కాంగ్రెస్ లో ఒకసారి గెలిచారు.

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ప్రసన్న గెలిచారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ప్రసన్న పోటీ చేయడం ఖాయమే..ఇటు టి‌డి‌పి నుంచి దినేష్ బరిలో ఉంటారు. అయితే ప్రస్తుతం పరిస్తితులని చూస్తే కోవూరులో టి‌డి‌పి, వైసీపీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. కొద్దిగా వైసీపీకే ఎడ్జ్ ఉంది. ఇక ఎన్నికల నాటికి దినేష్ ఇంకా బలపడితే..ప్రసన్నకు చెక్ పెట్టవచ్చు. చూడాలి మరి ఈ సారి కోవూరు ఎవరు సొంతమవుతుందో.