ఆ సీటుపై చంద్ర‌బాబు గురి… సిట్టింగ్ ఎమ్మెల్యే సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ ప‌క్కా…!

ఎన్నికల సమయం దగ్గరపడుతుంది..అటు వైసీపీ నేతలు, ఇటు టీడీపీ నేతలు ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఎవరికి వారు గెలుపు దిశగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో పై చేయి సాధించాలని చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల్లో ఉండాల్సింది..టి‌డి‌పి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కాస్త సైలెంట్ గా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన పెద్దగా వార్తల్లో కూడా కనిపించడం లేదు. ఏదో అప్పుడప్పుడు ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాస్తుంటారు.

అంతే తప్ప నియోజకవర్గంలో కూడా పెద్దగా కనిపిస్తున్నట్లు లేరు. ఆయన ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అంటే రేపల్లెలో జనం తన వైపే ఉన్నారనుకుని సైలెంట్ గా ఉంటున్నారా? లేక ఎన్నికల ముందు రంగంలోకి దిగుదామని అనుకుంటున్నారా? అనేది క్లారిటీ లేదు గాని..అనగాని మాత్రం పెద్దగా రేపల్లెలో కనిపించడం లేదనే టాక్ వస్తుంది. అయితే వరుసగా రెండుసార్లు గెలిచిన అనగాని..మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.

Jagan's Musalayana Comment: TDP MLA's Smart Reverse Punch

కానీ రేపల్లెలో అనగానికి హ్యాట్రిక్ కొట్టడం సాధ్యమవుతుందా? ప్రస్తుతం అక్కడ రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నాయి? అనే అంశాన్ని పరిశీలిస్తే..రేపల్లెలో టీడీపీ బలంగానే ఉంది..అందులో డౌట్ లేదు.అసలు అది టి‌డి‌పి కంచుకోట. అదే సమయంలో వరుసగా ఓడిపోతున్న మోపిదేవి వెంకటరమణ ఈ సారి రేపల్లెలో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన..వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే.

రేపల్లెలో మోపిదేవి తనయుడు పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆయన తనయుడులో ఫీల్డ్ లోకి దిగి పనిచేస్తున్నారు. మొత్తం పెత్తనం ఆయన తనయుడుదే. ఇక్కడ వైసీపీ కూడా బలపడుతుంది. లోకల్ ఎన్నికల్లో కూడా వైసీపీ సత్తా చాటింది. అటు కీలకమైన రేపల్లె మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది.

దీంతో రేపల్లెలో టి‌డి‌పితో పోటీగా వైసీపీ ఎదిగింది. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డిపి-వైసీపీ మధ టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక చంద్ర‌బాబు కూడా అన‌గానిపై ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. ఈ సారి అక్క‌డ టీడీపీ ప‌క్కాగా విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమాతో ఇప్ప‌టికే అన‌గానికి సీటు కేటాయించేశారు. అక్క‌డ ఈ సారి ఎంత‌ టఫ్ ఫైట్ ఉన్నా అనగాని హ్యాట్రిక్ కొట్టే ఛాన్సులే ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి.