టీడీపీ సంచలనం..1985 తర్వాత ఆ సీటులో గెలుపు…?

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంచలనాలు సృష్టించేలా ఉంది..చాలా ఏళ్లుగా గెలుపుకు దూరమైన స్థానాల్లో కూడా టి‌డి‌పి సత్తా చాటేలా ఉంది. వైసీపీపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టి‌డి‌పికి అనుకూలంగా పరిస్తితులు మారుతున్నాయి. అయితే ఈ సారి టి‌డి‌పి విజయం ఊహకు అందని విధంగా ఉండేలా ఉంది. అలా ఊహకు అందని విజయాలు అందుకోవడానికి టి‌డి‌పి రెడీ అయింది.

Kodumur | Facebook

ఈ క్రమంలోనే ఎప్పుడో 1985లో ఒకసారి గెలిచి..మళ్ళీ ఇంతవరకు గెలుపు తీరాలకు చేరని కోడుమూరులో ఈ సారి టి‌డి‌పి జెండా ఎగిరేలా ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ స్థానం..ఇక్కడ్ టి‌డి‌పి గెలిచింది కేవలం 1985లో మాత్రమే. మళ్ళీ ఆ తర్వాత టి‌డి‌పి ఎప్పుడో గెలవలేదు. అంటే ఆ స్థానంలో టి‌డి‌పి పరిస్తితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 1994, 1999, 2014 ఎన్నికల్లో కూడా కోడుమూరులో టి‌డి‌పి సత్తచాటలేకపోయింది.అయితే 2014 పొత్తులో భాగంగా కోడుమూరు సీటుని బి‌జే‌పికి ఇచ్చింది. దీంతో టి‌డి‌పి ఓట్లు పూర్తిగా బి‌జే‌పికి వెళ్లలేదు. దీంతో వైసీపీ భారీ విజయం అందుకుంది. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి డైరక్ట్ గా బరిలో దిగింది..కానీ జగన్ గాలిలో వైసీపీ విజయం అందుకుంది.

Kotla Surya Prakash cadre backs his move to join Desam

అలా కోడుమూరులో టి‌డి‌పి గెలుపుకు దూరమైంది. కానీ ఈ సారి సీన్ మారిపోతూ వస్తుంది. వైసీపీని గెలిపిస్తూ వస్తున్న ప్రజలకు విసుగు వచ్చేసింది అభివృద్ధి లేకపోవడం, పన్నుల భారం పెరగడం, ఎమ్మెల్యే సరిగా అందుబాటులో లేకపోవడంతో అక్కడి ప్రజలకు వైసీపీపై వ్యతిరేకత పెరిగింది.ఈ క్రమంలోనే టి‌డి‌పికి కొత్త ఊపు వచ్చింది. ఇక్కడ టి‌డి‌పి ఇంచార్జ్ గా ఆకేపోగు ప్రభాకర్ ఉన్నారు..కానీ ఇక్కడ టి‌డి‌పిని బలోపేతం చేసే పనిమొత్తం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఫ్యామిలీ చూసుకుంటుంది. దీంతో ఇక్కడ టి‌డి‌పి చాలావరకు బలపడింది. ఇటీవల వచ్చిన సర్వేల్లో కోడుమూరులో టి‌డి‌పి గెలవడం ఖాయమని తేలింది. 2024లో టి‌డి‌పి గెలిస్తే సంచలనమనే చెప్పాలి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, viral news, YS Jagan, ysrcp