న‌గ‌రి నుంచి రోజా అవుట్‌… జ‌గ‌న్ పెట్టే క‌ఠిన ప‌రీక్ష‌లు రోజా గెలుపు క‌ష్ట‌మే…!

వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్.. మంత్రి ఆర్కే రోజాకు రాజకీయంగా సొంత నియోజకవర్గ నగరిలో కష్టాలు మొదలయ్యాయి. ఆ మాటకు వస్తే రోజా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆమె సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు అయితే రోజా రెండోసారి గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిందో.. ఆప్పటి నుంచి ఆమె సొంత పార్టీ నేతల సెగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలు రోజా రాజకీయంగా ఎదగటం చిత్తూరు జిల్లాలో సొంత పార్టీలోనే కొందరు కీలక నేతలకు ఇష్టం లేదు.

Telangana - Jagan Mohan Reddy's mother quits YSR Congress to side with daughter - Telegraph India

రోజా మంత్రి పెద్దిరెడ్డి, మరో మంత్రి నారాయణస్వామి పై ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. తన నియోజకవర్గంలో తనను దెబ్బకొట్టేందుకు వీరిద్దరూ ట్రై చేస్తున్నారని ఆమె అసంతృప్తితో ఉన్నారు. అసలు రోజాకు మంత్రి పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఆమె చేసిన సేవలు గుర్తించిన జగన్ ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఇప్పుడు పేరుకు మాత్రమే ఆమె మంత్రిగా ఉన్న.. సొంత నియోజకవర్గం నగ‌రిలో మాత్రం తీవ్రమైన అసమతి సెగలో విలవిలలాడుతున్నారు.

CM Jagan prioritising women uplift despite financial crunch: Roja

నగరిలో గత రెండు ఎన్నికల్లోను గాలి కుటుంబం స్వల్ప తేడాతో ఓడిపోతుంది. గత ఎన్నికల్లో ఓడిన గాలి భాను ప్రకాష్ నాయుడు వచ్చే ఎన్నికల్లోను పోటీకి రెడీ అవుతున్నారు. ఇటు రోజపై వ్యతిరేకత.. అటు గాలి ఫ్యామిలీ పై ఉన్న సానుభూతి నేపథ్యంలో నగరిలో వచ్చే ఎన్నికల్లో రోజా గెలవరని అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ వచ్చే ఎన్నికల్లో రోజాను నగరి నుంచి కాకుండా చంద్రగిరి నుంచి పోటీ చేయించే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి బలమైన నేత ఉన్నారు. ఆయనను జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు.

YSRCP MLA Chevireddy Bhaskar Reddy distributes 30,000 blouse pieces to women

రోజా కూడా చంద్రగిరిలో 2009 ఎన్నికల్లో పోటీ చేసి మాజీ మంత్రి గల్లా అరుణ‌ కుమారి పై ఓడిపోయారు. చెవిరెడ్డిని తిరుపతి సిటీ లేదా మరో బలమైన నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచన జగన్‌కు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈసారి నగరిలో రోజాకు సానుకూల వాతావరణం లేకపోవడంతో ఆమెను మళ్లీ అక్కడ పోటీ చేయించి ఆ సీటు కోల్పోవడం జగన్‌కు ఇష్టం లేదని.. అందుకే ఈ మార్పు చేర్పులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. ఒక‌వేళ రోజా చంద్ర‌గిరిలో పోటీకి దిగితే ఆమె గెలుపు క‌ష్ట‌మే అని టాక్ ?

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp