గుడివాడలో కొత్త కాంబినేషన్..కొడాలి అవుట్…!

గుడివాడ ఈ నియోజకవర్గం పేరు చెబితే కొడాలి నాని మాత్రమే గుర్తొస్తారు. ఒకప్పుడు టి‌డి‌పి కంచుకోట అని గుర్తొచ్చేది. కానీ గత రెండు ఎన్నికల నుంచి కొడాలి అడ్డా అన్నట్లు పరిస్తితి మారింది. టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వెళ్ళి కొడాలి వరుసగా రెండుసార్లు గెలిచారు. ఇక మూడోసారి కూడా కొడాలి గెలవడం ఖాయమని తాజా సర్వేల్లో తేలింది. అంటే గుడివాడలో కొడాలి హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే కొడాలికి చెక్ పెట్టడం కష్టమేనా? అంటే పెద్దగా కష్టం కాదనే చెప్పాలి.

 

కాకపోతే టి‌డి‌పి నేతలు కలిసికట్టుగా పనిచేయాలి..ఒక బలమైన అభ్యర్ధిని బరిలో దింపాలి. ప్రస్తుతం రావి వెంకటేశ్వరరావుకు టి‌డి‌పి క్యాడర్ లో బాగా పాజిటివ్ ఉంది..మిగతా నేతలు ఆయనకు సపోర్ట్ గా ఉంటూ టి‌డి‌పి కోసం పనిచేస్తే గుడివాడలో కొడాలికి చెక్ పెట్టడం కష్టం కాదు. అయితే గతంలో మూడుసార్లు కొడాలి గెలిచిన అధికారంలో లేరు. అందుకే ఏం చేయలేకపోయారని ప్రజలు అనుకున్నారు.

Kodali Nani Loves NTR In Winter, Don't Care In Summer!

కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు..మంత్రిగా చేశారు. అయినా సరే గుడివాడకు చేసిందేమి లేదు..దీంతో కొన్ని వర్గాల ప్రజలు కొడాలిపై యాంటీగా ఉన్నారు. కాకపోతే పార్టీలకు అతీతంగా కొడాలికి సెపరేట్ ఓటు బ్యాంకు ఉంది. దాన్ని దెబ్బతీయాలి. ఇప్పుడు ఆ దిశగానే గుడివాడలో రాజకీయం నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంతకాలం గుడివాడలో ఉండే కాపులు కొడాలికే సపోర్ట్. కమ్మ వర్గంలో కొందరు కొడాలికి సపోర్ట్ ఇచ్చారు.

N Chandrababu Naidu seeks PM Modi's intervention on MSP, free power, crop  insurance

కానీ జనసేనతో పొత్తు ఉంటే ఈ సారి టి‌డి‌పికి కాపులు కలిసొస్తారు. కాపులు కొడాలిపై యాంటీగా ఉన్నారు. ఇంకా కమ్మ వర్గం చెప్పాల్సిన పని లేదు. అయితే కాపు-కమ్మ వర్గం కాంబినేషన్ కలిస్తే గుడివాడలో కొడాలికి రిస్క్ తప్పదు. అదే సమయంలో బీసీ, ఎస్సీ వర్గాలని మెజారిటీ సంఖ్యలో టి‌డి‌పి తిప్పుకుంటే డౌట్ లేకుండా గుడివాడలో కొడాలి ఓడిపోవడం ఖాయం. మరి ఈ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, viral news, YS Jagan, ysrcp