ఆయనతో వైసిపికి ఫుల్ డ్యామేజ్..టీడీపీలో నో క్లారిటీ.!

రాష్ట్రంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం..అందులో ఎలాంటి డౌట్ లేదు..సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకే వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేసేదేమీ ఉండటం లేదు. పైగా కొందరు ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది.

వైసీపీ ఎమ్మెల్యేకు సొంతపార్టీ నేతల నిరసన సెగ: అసహనంతో షాకింగ్ పని చేసిన  ఎమ్మెల్యే!! | ysrcp internal war.. elamanchili MLA kannababu slaps a man -  Telugu Oneindia

ఈ క్రమంలోనే ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు పరిస్తితి కూడా అలాగే ఉంది. ఈయనపై వ్యతిరేకత త్వరగానే వచ్చింది. దీని వల్ల ఎలమంచిలిలో వైసీపీకి డ్యామేజ్ పెరుగుతూ వస్తుంది. పైగా ఈయనపై సొంత పార్టీ వాళ్ళే గుర్రుగా ఉన్నారు. తాజాగా గడపగడపకు వెళ్ళిన కన్నబాబుకు ఓ గ్రామంలో నిరసన సెగ గట్టిగా తగిలింది. గతంలో ఇచ్చిన హామీలపై గ్రామలో ఉన్న సొంత పార్టీ నేతలే నిలదీశారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే..వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. అయితే ఎమ్మెల్యేని అదుపు చేయాలని చూసి..ఆయన పి‌ఏ చెంపదెబ్బ తిన్నారు. ఎమ్మెల్యే..తన పి‌ఏపైనే చేయి చేసుకున్నారు. దీనిపై మరింత రచ్చ జరిగింది.

తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు తొల‌గించండి..! ఈసీ కి అందిన ఫిర్యాదు..!!  | Ban the cycle symbol to tdp..! complained to EC..!! - Telugu Oneindia

ఇలా ఎమ్మెల్యే వ్యవహారం బాగా వివాదాస్పదం అయింది. ఇలాంటి పరిస్తితుల వల్ల ఎలమంచిలిలో వైసీపీకి బాగా నెగిటివ్ అవుతుంది..మళ్ళీ ఎన్నికల్లో కన్నబాబుకు సీటు డౌట్ అనే పరిస్తితి..అలాగే వైసీపీ గెలిచే పరిస్తితులు కనిపించడం లేదు. అలా అని ఇక్కడ టి‌డి‌పికి ప్లస్ పెద్దగా కనిపించడం లేదు. ఇక్కడ టి‌డి‌పిలో కన్ఫ్యూజన్ ఉంది. ప్రస్తుతం ఇంచార్జ్ గా ప్రగడ నాగేశ్వరరావు ఉన్నారు. మరి ఆయనకు సీటు దక్కుతుందో లేదో క్లారిటీ లేదు. అదే సమయంలో జనసేన నుంచి సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. టి‌డి‌పి-జనసేన మధ్య పొత్తు ఉంటే ఎలమంచిలి సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు. పొత్తు ఉంటే మాత్రం వైసీపీ గెలవడం కష్టమే.