టిడిపి జనసేన కూటమి తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు కొత్త రూపు సంతరించుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి అభివృద్ధి అన్నదే లేదని అందరూ విమర్శిస్తున్నారు. టిడిపి ప్రభుత్వంలో ప్రారంభించిన అన్ని పథకాలను, ప్రాజెక్టులను, గృహ నిర్మాణాలను, ముఖ్యంగా అమరావతి రాజధాని అన్నింటిని వైసిపి అధికారంలోకి రాగానే ఆపివేసిందని, అలా చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి 10 సంవత్సరాలు వెనకకు వెళ్ళిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా అక్కడ ఒక పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండాలని మేధావులంతా చెబుతున్నారు. అలా పది సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో బిఆర్ఎస్ ఉండడం వల్లనే అక్కడ మిషన్ భగీరథ, కాలేశ్వరం ప్రాజెక్టు వంటి వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయగలరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2014 నుంచి 19 వరకు టిడిపి అధికారంలో ఉంది.
అప్పుడు ప్రారంభించిన అన్ని పనులను 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆపివేశారు. మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టారు అంటే అప్పటి వరకు అక్కడ ఆ పనుల పై పెట్టిన పెట్టుబడి మొత్తం వృధాయే కదా అని అందరూ వాపోతున్నారు. అందుకే ఈసారి జనసేన టిడిపి కూటమి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలు టిడిపి, తర్వాత ఐదు సంవత్సరాలు జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళతామని టిడిపి జనసేన కూటమి వారు చెబుతున్నారు.
ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఒకే పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండాలని రాజకీయ నిపుణులు చెబుతుండడంతో జనసేన టిడిపి కూటమి కూడా పది సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళతామని ప్రజల ముందుకు వెళుతున్నారు. ప్రజలందరూ ఇప్పటికే వైసీపీ పై ఉన్న తీవ్ర వ్యతిరేకతతో టిడిపి వైపు చూస్తూ ఉండడంతో, జనసేన టిడిపి పొత్తు ఈసారి గ్రాండ్ సక్సెస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి 10 సంవత్సరాల పాలనకు ప్రజలు ఓటేస్తే ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోంది కదా..!