టిడిపి గెలుపు కోసం చూస్తున్న కార్పొరేట్ సంస్థలు…? టిడిపికి భారీగా నిధులు….?

ఏ పార్టీ గెలుపు కైనా ముఖ్యం అంగ బలం అర్థబలం. అంగబలం అంటే నాయకులే కాదు, ప్రజలను కూడా కూడగట్టుకోవడం. ప్రజల తమ వైపు రావాలంటే కావాల్సింది అర్ధ బలం. మహానేతలకైనా ఎన్నికలవేళ చేతిలో డబ్బులు ఉండడం కష్టమే, అలాంటిది ప్రతిపక్ష నేతలకు ప్రజలకు పంచే డబ్బంటే ఇంకా కష్టమని చెప్పవచ్చు. అధికార పార్టీ వారి కైతే నిధులు వరదలా వస్తాయి, కానీ ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడానికి మాత్రం సంశయిస్తూ ఉంటారు.

గత ఎన్నికల్లో వైసీపీకి కార్పొరేట్ సంస్థల నుంచి నిధులు వెల్లువెత్తాయి. టిడిపికి మాత్రం అరకొర నిధులతో సరిపెట్టారు. వాటికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఒకటైతే, హైదరాబాద్ నుంచి రావాల్సిన వాటిని కెసిఆర్ అడ్డుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో టిడిపికి కార్పొరేట్ సంస్థలు నిధులు సమకూర్చడానికి ఎదురు చూస్తున్నారు.

కానీ నిధులకు బిజెపి అనుమతిస్తే చాలు అని టిడిపి ఎదురు చూస్తుంది. అదే జరిగితే టిడిపిని ఎన్నికలలో ఓడించటం ఎవరి తరం కాదు అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అధికార వైసిపి టిడిపి నేతల అన్ని బలాలను దెబ్బతీసింది అని చెప్పవచ్చు. అక్రమ కేసులతో, అరెస్టులతో, ఐటీ రైడులతో అన్ని దారులను మూసివేశారు. ఇప్పుడు టిడిపికి ఉన్న ఒకే ఒక మార్గం బిజెపి సహకరిస్తే కార్పొరేట్ సంస్థల నుంచి భారీగా నిధులు సేకరించటం. అందుకని టిడిపి నేతలు బిజెపితో చర్చలు జరుపుతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.

బిజెపి చూసి చూడనట్లు ఉంటే టిడిపికి వచ్చే నిధుల వెల్లువను ఆపటం ఎవరి వల్ల కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికార వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలందరూ టిడిపి వైపు చూస్తూ ఉండడంతో కార్పొరేట్ శక్తులన్నీ టిడిపికి అండగా ఉండడానికి నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరి టిడిపి నేతల చర్చలు ఫలిస్తే ఈసారి ఏపీలో ఎగిరేది టిడిపి జెండానే అనుకోవాల్సిందే..!