అక్క‌డ‌ వైసీపీ హ్యాట్రిక్‌కు టీడీపీ బ్రేకులు..!

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న స్థానాలని వైసీపీ నిదానంగా కంచుకోటలుగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే. టి‌డి‌పిని దెబ్బకొడుతూ వైసీపీ డామినేషన్ కొనసాగిస్తుంది. అలా వైసీపీ ఆధిక్యం సాధించిన నియోజకవర్గం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం స్థానం. ఈ స్థానం మొదట్లో టి‌డి‌పికి పట్టున్న స్థానం. 1983, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో పాతపట్నంలో టి‌డి‌పి జెండా ఎగిరింది.

Odisha's Daughter-In-Law Elected Andhra Pradesh Lawmaker - odishabytes

2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది..ఇక గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. 2014లో వైసీపీ నుంచి కలమట వెంకటరమణ మూర్తి గెలిచి..ఆ తర్వాత టి‌డి‌పిలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో కలమట టి‌డి‌పి నుంచి వైసీపీ నుంచి రెడ్డి శాంతి పోటీ చేశారు. విజయం రెడ్డి శాంతిని వరించింది. ఇక వైసీపీ నుంచి గెలిచిన రెడ్డి శాంతి చాలా త్వరగానే ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. ఎమ్మెల్యేగా పాతపట్నంలో ఆమె చేసిన అభివృద్ధి శూన్యమే. పైగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వారసుడు పెత్తనం పెరిగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.

Work with TDP government: Kalamata - Sakshi

ఇక్కడ అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అటు ఓడిపోయిన దగ్గర నుంచి కలమట టి‌డి‌పిలో దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రజల్లో ఉంటున్నారు..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే పాతపట్నం టి‌డి‌పిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సీటుని మామిడి గోవిందరావు సైతం ఆశిస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తానంటూ మామిడి గోవిందరావు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. దశాబ్దకాలంగా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

దీంతో పాతపట్నం టి‌డి‌పి సీటు విషయంలో కాస్త క్లారిటీ లేదు. కానీ నియోజకవర్గంలో టి‌డి‌పికే లీడ్ ఉంది. అయితే ఈ నెల 10న చంద్రబాబు నియోజకవర్గానికి రానున్నారు..అప్పుడు సీటుపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. దాదాపు కలమటకే సీటు ఇచ్చి..గోవిందరావుకు ఏదైనా పదవి ఇవ్వవచ్చని తెలుస్తోంది. మొత్తానికి పాతపట్నంలో టి‌డి‌పి హవా ఉందని చెప్పవచ్చు.