చైతన్య మాస్టర్ ఆత్మహత్య..శ్రద్దా దాస్ అలా..రష్మి ఇలా.. అంత టార్చర్ చేసారా..?

“ఢీ” షో ప్రోగ్రామ్ ద్వారా కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే . నెల్లూరులోని హోటల్లో ఆయన సూసైడ్ కు పాల్పడ్డాడు చనిపోయే ముందు ఆయన ఎందుకు చనిపోతున్నానో కూడా కారణం గా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు . ఆ వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఆ వీడియోలు చైతన్య మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ క్లియర్ గా మెన్షన్ చేశాడు . ఈ క్రమంలోనే ఆయన మరణం బుల్లితెర ప్రముఖులకు షాక్ ఇచ్చింది . అంతేకాదు ఆయనతో వర్క్ చేసిన శ్రద్ధాదాస్ – రష్మి గౌతమ్ – శేఖర్ మాస్టర్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు .

ఈ క్రమంలోనే ఆయన మరణానికి చింతిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలోనే రష్మి గౌతమ్..” మీరు తప్పు చేశారు చైతన్య మాస్టర్.. మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇది కాదు ..మీ పేరెంట్స్ కి ఆ దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అంటూ పోస్ట్ పెట్టింది. శ్రద్ధాదాస్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఆయనతో గడిపిన సందర్భాల గురించి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది .

“జీవితంలో చావు పుట్టుక అనేవి చాలా సెన్సిటివ్ మేటర్స్ ..మధ్యలో మనం ఎలా బ్రతకామా అన్నది ఇంపార్టెంట్ . ఆ విషయంలో మీరు సక్సెస్ అయ్యారు . కానీ మీరు ఇలా సూసైడ్ చేసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ గా లేదు . మీరు అనుకున్న గోల్ ని రిచ్ అయ్యేలా చేసుకుని ఉండాల్సింది “అంటూ పోస్ట్ పెట్టుకో వచ్చింది . ఇక శేఖర్ మాస్టర్ చాలా ఎమోషనల్ అవుతూ “ఇండస్ట్రీ ఓ మంచి కొరియోగ్రాఫర్ ని కోల్పోయింది . ఆ విషయం తెలిసినప్పటి నుంచి నేను షాక్ లో ఉన్నాను ” అంటూ చెప్పుకు వచ్చారు .

ఈ క్రమంలోనే చైతన్యకు బుల్లితెర ప్రముఖులు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు . అయితే అప్పులు ఇచ్చిన వాళ్ళు చైతన్యని బాగా టార్చర్ చేశారని.. ఆ బాధలు భరించలేకనే జీవితం పై బ్రతకాలని ఆశ ఉన్నా కానీ చైతన్య ఇలా సూసైడ్ చేసుకున్నాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!