ఏపీలో మాజీలకు భద్రత కట్…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయానికి సిద్దమవుతున్నారా…? ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా విపక్ష టీడీపీ మీద కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇప్పుడు జగన్ ఆ విధంగానే మరో కీలక, సంచలన అడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఉండే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సహా పలువురు మాజీ ప్రజాప్రతినిధులకు ప్రస్తుతం గన్ మెన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మావోయిస్ట్ ల నుంచి ముప్పు ఉన్న నేపధ్యంలో వారికి భద్రత కల్పిస్తుంది ప్రభుత్వం. అలాగే రాయలసీమలో యెర్ర చందనం దుండగుల నుంచి కూడా వారికి ముప్పు ఉంది. అందుకే గత ప్రభుత్వాలు భద్రతను కొనసాగించాయి.

ఇప్పుడు ఆ భద్రతను పూర్తిగా తీసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వారి ప్రాణాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా ప్రజల్లో ఉండే మాజీ ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్ళకుండా కట్టడి చెయ్యాలనే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంటుంది అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags: AP, Eliminating Security, Ex MLAs, MPs, tdp, YS Jagan, ysrcp